Barkha Madan
మోడల్‌గా పెద్ద పెద్ద ఈవెంట్లు చేసింది. .. నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఐశ్వర్య రాయ్ లాంటి వారికి పోటీ వెళ్లింది. కాని సడెన్ గా తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ.. ఇండస్ట్రీ వదిలి సన్యాసినిగా మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ..?
Barkha Madan
బర్ఖా మదన్.. ఈ పెరు పెద్దగా తెలిసి ఉండదు కాని.. ఒకప్పుడు మాత్రం మంచి పేరున్న మోడల్. 1994 లో మిస్ ఇండియా ఫైనలిస్టు. పెద్ద పెద్ద అందగత్తెలతో పోటీపడి.. అందాల కిరీటం సాధించాలని ఆరాటపడిన బ్యూటీ. దేశం అంతా జేజేలు కొట్టిన సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్‌లతో కూడా పోటీ పడి మొదటి రన్నరప్‌గా నిలిచింది బ్యూటీ. ఆతరువాత కూడా మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్‌గా నిలిచారు బుర్ఖా.
ఇక ఆతరువాత సినిమా కెరీర్ ను కూడా అంతే సక్సెస్ ఫుల్ గా నడిపింది సీనియర్ బ్యూటీ. . 1996 లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆతరువాత 2003 లో రామ్ గోపాల్ వర్మ ‘భూత్’ సినిమాలో కనిపించారు. ఈసినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది. దెయ్యం పాత్రలో అందరిని భయపెట్టడమే కాకుండా.. తన నటనతో ఆడియన్స్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు.
అటు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా సత్తా చాటింది మదన్. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచేసిన 49 ఏళ్ళ ఈ సీనియర్ బ్యూటీ.. తాజాగా అందరికి షాక్ ఇచ్చింది. అకస్మాత్తుగా సన్యాసినిగా మారిపోయిఅందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు తన పేరు కూడా మార్చేసుకుంది ఇంతకీ ఆమె పేరు ఏంటోతెలుసా..?
Barkha Madan
బర్ఖా మదన్ పేరు ఇప్పుడు గ్యాల్టెన్ సామ్టెన్. సన్యాసినిగా మారి.. కాశాయం కట్టి.. పర్వతాలు, ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన ఆధ్యాత్మిక అంశాలనే పోస్టు చేస్తున్నారు బర్ఖా మదన్. దలైలామా ఫాలోవర్‌గా ఉన్న బర్ఖా.. 2012 లోనే బౌద్ధమతాన్ని స్వీకరించాలని అనుకున్నారట. కానిఅప్పుడు పరిస్థితులు ఆమెకు కలిసి రాలేదు.
ఇక ప్రస్తుతం ఆమె ఆశ్రమ జీవితం గడుపుతూ.. ధ్యానం, ప్రార్థనలు, ప్రజలకు సేవలతో బిజీ అయిపోయింది. సినిమా జీవితంలో ఆమె ఎన్నో పాత్రలు పోషించింది. ఇండస్ట్రీలో మోడల్‌గా, హీరోయిన్ గా , క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా కూడా ఉన్న బర్ఖా సన్యాసినిగా మారడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు ఆమె సన్నిహితులు.మరి ఈ విషయం ఆమె ఎప్పుడు వెల్లడిస్తుందో చూడాలి.