సీరియల్ నటిగా అవికా గోర్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. చిన్నారి పెళ్లికూతురిగా దేశ వ్యాప్తంగా టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ‘బాలిక వధు’ సీరియల్ లో తన పెర్ఫామెన్స్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం వెండితెరపైనా మెరుస్తున్న విషయం తెలిసిందే. తనకు వస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ నటించిన అవికా హీరోయిన్ గా మాత్రం తన కెరీర్ ను టాలీవుడ్ తోనే ప్రారంభించింది.
ఉయ్యాల జంపాల.. చిత్రంతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది. ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో అవికాకు మరిన్ని ఆఫర్లు దక్కాయి. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. మరోవైపు నెట్టింట తెగ సందడి చేస్తోంది.
తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. నార్త్ లో కంటే సౌత్ ఇండస్ట్రీలోనే నెపోటిజం ఉందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దక్షిణాది సినీ పరిశ్రమ బంధుప్రీతితో నిండిపోయిందని అనడం హాట్ టాపిక్ గ్గా మారింది.
గతంలోనూ నెపోటిజంపై చాలా మంచి స్పందించారు.అయితే దీనిపై సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెపోటిజం వల్ల ఎవరూ ఇండస్ట్రీని శాసించలేరు. స్కిల్, టాలెంట్ ఉన్న వాళ్లే ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పిన విషయం కూడా తెలిసిందే.
ఇక అవికా గోర్ ఈ ఏడాది ప్రారంభంలో ‘పాప్ కార్న్’ చిత్రంతో అలరించింది. చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగు సినిమా ‘ఉమాపతి’, హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘1920 : హార్రర్ ఆఫ్ ది హార్ట్స్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.