పట్టుచీరలో మెరిసిపోతున్న తెలుగు హీరోయిన్ అంజలి.. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేస్తున్న RC15 బ్యూటీ

First Published | Mar 23, 2023, 10:52 AM IST

తెలుగు హీరోయిన్ అంజలి (Anjali)  బ్యూటీఫుల్ లుక్ లో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. ఫెస్టివల్ సందర్భంగా యంగ్ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి కుర్ర హృదయాలను దోచుకుంటోంది. 
 

తెలుగు బ్యూటీఫుల్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని వెండితెరపై అలరించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేసింది.
 

ప్రస్తుతం అంజలి నటిస్తున్న భారీ చిత్రం RC15. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 


ఇలా వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటూ వస్తున్న తెలుగు హీరోయిన్ మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో తన ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 

అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఉగాది పండుగా సందర్భంగా అంజలి ట్రెడిషన్ లుక్ లో ఆకట్టుకుంటోంది. పట్టుచీరలో మెరిసిపోతోంది. 

సంప్రదాయ దుస్తుల్లో ఎంతగానో ఆకర్షించే అంజలి.. ఫెస్టివల్ సందర్భంగా క్రీమ్ కలర్ శారీ ధరించి మంత్రముగ్ధులను చేసింది. అట్రాక్టివ్ జ్యూవెల్లరీ ధరించి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

నిండు తెలుగుదనంతో అభిమానులను అంజలి ఖుషీ చేసింది. తన ఫెస్టివల్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విద్యుదీపాల కాంతిలో వెలిగిపోతున్న ఈ ముద్దుగుమ్మ అందాలను లైక్స్, కామెంట్ల రూపంలో పొడుగుతున్నారు. ఇక అంజలి చివరిగా ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్,  ‘మాచర్ల నియోజవకర్గం’ తో ఆకట్టుకుంటోంది. ‘ఆర్సీ15’తో పాటు ‘బహిష్కరణ’ అనే మరో వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. 
 

Latest Videos

click me!