పొలిటికల్‌ ఫైర్‌ బ్రాండ్‌ రోజా గ్రాండ్‌ బర్త్ డే సెలబ్రేషన్‌

First Published Nov 17, 2020, 3:07 PM IST

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ ఎలా ఫైర్‌ బ్రాండ్‌గా రాణిస్తున్న ఏపీ రాజకీయాల్లో కూడా రోజా సెల్వమణి ఫైర్‌ బ్రాండ్‌గా పిలవబడుతున్నారు. నటిగా, హోస్ట్ గా, ఎమ్మెల్యేగా రాణిస్తున్న రోజా.. నేడు(మంగళవారం) 48వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

తెలుగులో ఇరవై ఏళ్ళ క్రితం స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రోజా.. రాజకీయాల్లోకి వెళ్లాక.. సినిమాలు తగ్గించారు. అడపాదడపా మెరుస్తున్నారన్నాంతే. మరోవైపు హోస్ట్ గా మెప్పిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తున్నారు.
undefined
1972 నవంబర్‌ 17న ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజరెడ్డి, లలితా దంపతులకు జన్మించిన రోజా.. తిరుపతిలోనే ఉన్నత విద్య పూర్తి చేశారు.
undefined
సినిమాల్లోకి రాకముందు సినిమాల్లోకి రాకముందు కూచిపూడి నాట్య కారిణిగా అలరించారు. అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చి మెప్పించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
undefined
రోజాలోని ప్రతిభ సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆమె `ప్రేమ తపస్పు` చిత్రంతో హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం అయ్యింది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ సరసన హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
undefined
ఈ సినిమా ఫర్వాలేదనిపించడంతోపాటు నటిగా రోజా నటనకు మంచి పేరు వచ్చింది. నటనతో, అందంతో ఆకట్టుకుంది.
undefined
శోభన్‌బాబు హీరోగా వచ్చిన `సర్పయాగం`లో ఆయనకు కూతురు పాత్రలోనూ నటించింది. ఈ సినిమా సక్సెస్‌ కావడంతో అవకాశాలు రోజాని క్యూ కట్టాయి. పైగా సురేష్‌ప్రొడక్షన్స్ లో సినిమా కావడంతో లార్జ్ స్కేల్‌లో సినిమా అలరించింది.
undefined
`సీతారత్నం గారి అబ్బాయి` సినిమాతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని పాపులారిటీని తెచ్చుకుంది. చిరంజీవితో కలిసి నటించిన `ముఠామేస్త్రీ`లో నటించింది.
undefined
బాలకృష్ణ నటించిన `భైరవ ద్వీపం`లో రాకుమారిగా నటించి వాహ్‌ అనిపించింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
undefined
సెల్వమణి దర్శకత్వంలో `చెంబరుతి` చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో సెల్వమణితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. పెద్దలనుఒప్పింది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2002లో వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ఉన్నారు.
undefined
పెళ్ళి తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. మొదట టీడీపీలో కొనసాగారు. అనేకమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఐరన్‌ లెగ్‌గా ముద్ర వేసుకున్నారు.
undefined
ఆ తర్వాత వైఎస్‌ఆర్ సీపీలోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. ఇప్పుడు ఎమ్మెల్యేగా, `జబర్దస్త్` షోకి హోస్ట్ గా ఉంటూ రెండింటినిబ్యాలెన్స్ చేస్తున్నారు.
undefined
ఇక ఈ రోజు తన బర్త్‌ డే ఫ్యామిలీతో కలిసి ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
undefined
click me!