బిగుతైన డ్రెస్ లో ‘లైగర్’ బ్యూటీ కిర్రాక్ ఫోజులు.. ఇక్కడ బెడిసికొట్టినా.. అక్కడ అదరగొడుతోంది..

First Published | Aug 18, 2023, 9:19 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. కానీ పెద్దగా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ పేలలేదు. దీంతో బాలీవుడ్ లోనే మళ్లీ బిజీ అయ్యింది. 
 

‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ చిత్రంతో అనన్య పాండే (Ananya Panday)  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’, ‘ఖాళీ పీళీ’, ‘గెహ్రైయా’ వంటి సినిమాల్లో నటించి సెన్సేషన్ గా మారింది. 

చిన్న వయస్సులోనే స్టార్స్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామర్ పరంగానే కాకుండా నటనతోనూ మెప్పింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టాలీవుడ్ ఎంట్రీకి అవకాశం కలిపించారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ పేలిపోయేది.
 


విజయ్ దేవరకొండ - అనన్య జంటగా పూరీ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘లైగర్’. గతేడాది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో అనన్యకూ ఇక్కడ పెద్దగా క్రేజ్ దక్కలేదు. తన పాత్రకూ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేనట్టుగా ఉండటంతో ఇక్కడి నుంచి అవకాశాలనూ అందుకోలేకపోయింది.

టాలీవుడ్ ఎంట్రీతో ఈ ముద్దుగుమ్మకు పెద్ద షాకే తగిలినా.. బాలీవుడ్ లో మాత్రం జోరుమీదనే ఉంది. వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ చిత్రంలో ఐటెం నెంబర్ తోనూ అదరగొట్టింది. 
 

ఇక ప్రస్తుతం తను నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఆగస్టు 25న రిలీజ్ కానుందీ మూవీ. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నయా లుక్ తో ఆకట్టుకుంటోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ అదరగొడుతోంది. తాజాగా మరిన్ని స్టన్నింగ్ పిక్స్ ను పంచుకుంది. 
 

లేటెస్ట్ పిక్స్ లో అనన్య బిగుతైన డ్రెస్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. కిర్రాక్ ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మత్తెక్కించే చూపులతో మైమరిపించింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ ఫొటోలకు లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక అనన్య మరో రెండు చిత్రాలు ‘ఖో గయే హమ్ కహా’, ‘కంట్రోల్’లోనూ నటిస్తోంది. 
 

Latest Videos

click me!