పింక్ డ్రెస్ లో అనన్య పాండే కిర్రాక్ పోజులు.. నయా లుక్ తో మతిపోగొడుతున్న ‘లైగర్’ బ్యూటీ..

First Published | May 8, 2023, 2:29 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) స్టన్నింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది.  తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్ లో అదరగొట్టింది.
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే రీసెంట్ గా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరిస్తున్న మద్దుగుమ్మ టాలీవుడ్  ఎంట్రీ మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయింది.  
 

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. ఈ చిత్రంలో అనన్య పాత్ర పెద్దగా మెప్పించేలా లేకపోయింది. పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. దక్షిణాది ఆడియెన్స్   కు మాత్రం దగ్గరకాలేకపోయింది.
 


ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లోనే సందడి చేస్తోంది. మరోవైపు ఆయా ఈవెంట్లతో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో అనన్య మెరిసింది. ట్రెండీ వేర్ లో కట్టిపడేసింది
 

లేత గులాబీ రంగు డ్రెస్ లో బ్యూటీఫుల్ లుక్ సొంతం చేసుకుంది. ట్రెండీ అవుట్ ఫిట్ తో పాటు చేతిలో బకెట్ స్టైల్ హ్యాండ్ బ్యాగ్ ను తీసుకొని వచ్చింది. మొత్తాన్ని కొత్తదనంతో ఆకట్టుకుంది. అనన్య ఫ్యాషన్ సెన్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ వస్తున్నారు. 
 

మరోవైపు అనన్య మత్తుపోజులతో మైమరిపించింది. గుచ్చే చూపులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. అర్యన్ ఖాన్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. అందంతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ మెరుపులకు నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

‘లైగర్’తో బెడిసికొట్టడంతో అనన్యకు తెలుగు నుంచి గానీ సౌత్ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపైనే ఈ ముద్దుగుమ్మ ఫోకస్ పెట్టింది. ‘కో గయే హమ్ కహన్’, ‘కంట్రోల్’, ‘డ్రీమ్ గర్ల్2’ చిత్రాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది.

Latest Videos

click me!