లెహంగా వోణీలో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతున్న అనన్య నాగళ్ల.. ట్రెడిషనల్ లుక్ లో యంగ్ బ్యూటీ మెరుపులు

First Published | May 23, 2023, 11:21 AM IST

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla)  బ్యూటీఫుల్ లుక్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. నటిగా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు దక్కించుకుంటోంది. వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తోంది. 
 

ఈ క్రమంలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఈ కుర్ర భామ నెట్టింట రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోస్ ను షేర్ చేసుకుంది అనన్య. 
 


లేటెస్ట్ గా అనన్య పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల మరింతగా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అందాలను ఆరబోసింది.  మెరిసిపోయే గ్లామర్ తో కట్టిపడేసింది. కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
 

తెలుగు బ్యూటీ అనన్య సంప్రదాయ దుస్తుల్లో ఎంత బ్యూటీఫుల్ గా ఉంటుందో తెలిసిందే. అటు ట్రెండీ వేర్స్ ల్లో మెరుస్తూనే వస్తోంది. ఇటు ట్రెడిషనల్ లుక్ లోనూ మెరుస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా వైట్ లెహంగా, వోణీలో ఫ్లడ్ లైట్ లా వెలిగింది. 
 

అనన్య అందానికి ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్  గా ‘మళ్లీ పెళ్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మెరిసింది. అందరి చూపు తనపైనే పడేలా చేసింది. 
 

కేరీర్ విషయానికొస్తే అనన్యకు తెలుగులో మంచి ఆఫర్లనే అందుకుంటోంది. మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ భారీ ప్రాజెక్ట్ లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. రీసెంట్ గా ‘శాకుంతలం’ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం ‘బూట్ కట్ బాల్రాజు’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Latest Videos

click me!