చివరిగా తెలుగులో ‘పిట్ట కథలు’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో షాక్ కు గురి చేసింది. అంతకు ముందు ‘ఆమె’ చిత్రంతోనూ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా హిందీలో ’భోళా’ సినిమాతో అలరించింది. ప్రస్తుతం మలయాళంలో ‘అడుజీవితం’, ‘ద్విజ’ చిత్రాల్లో నటిస్తోంది.