Amala Paul : తల్లి కాబోతున్న ఆనందంలో .. మలయాళీ ముద్దుగుమ్మ క్యూట్ ఫొటోషూట్

First Published | Jan 5, 2024, 9:00 PM IST

స్టార్ హీరోయిన్ అమలాపాల్ Amala Paul రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తల్లికాబోతున్న ఆనందంలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో మరిన్ని క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

మలయాళీ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం.. రామ్ చరణ్ ‘నాయక్’, ‘ఆమె’, ‘పిట్ట కథలు’ వంటి చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. సినిమాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలనూ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. 

 కాబోయే భర్తను పరిచయం చేసిన పదిరోజుల్లోనే అమలాపాల్ (Amala Paul) రెండో పెళ్లి చేసుకున్నారు. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ (Jagat Desai) తో నవంబర్ 5న వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఈ శుభవార్తను తానే  స్వయంగా ప్రకటించి, వెడ్డింగ్ ఫొటోలనూ పంచుకుంది. 


పెళ్లై రెండు నెలలు దాటిన వెంటనే మరో గుడ్ న్యూస్ కూడా  చెప్పింది. రీసెంట్ గానే తన తల్లికాబోతున్నట్టు కూడా ప్రకటించింది. రెండోసారి వివాహ బంధంలో మంచి రోజులు చూడబోతోంది. తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. 

ఇప్పటికే నెట్టింట అమలాపాల్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. మలయాళీ ముద్దుగుమ్మ ఇచ్చిన గుడ్ న్యూస్ కు అందరూ ఖుషీ అవుతున్నారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

అయితే, అమలాపాల్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. తల్లి కాబోతున్న తరుణంలో ఆనందంలో మునిగి తేలుతున్నారు. తను చాలా హ్యాపీగా ఉన్నానంటూ తెలియజేసే కొన్ని ఫొటోలను, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ను అభిమానులతో పంచుకుంది. 

ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అమలాపాల్ పంచుకున్న ఫొటోలను అభిమానులు లైక్స్, కామెంట్లతో మరింత వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ ఆనందంగా ఉండటం చూసి మురిసిపోతున్నారు. 

Latest Videos

click me!