ఆమె వల్లే సుమన్ బ్లూ ఫిలిం కేసు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేది..చిరంజీవిపై పుకార్లు ఎందుకంటే

First Published | Feb 22, 2024, 6:57 PM IST

సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు తిరుగులేని హీరోగా రాణించారు. సుమన్ క్రమంగా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన జీవితాన్ని కొన్ని వివాదాలు కుదిపేశాయి.

సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు తిరుగులేని హీరోగా రాణించారు. సుమన్ క్రమంగా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన జీవితాన్ని కొన్ని వివాదాలు కుదిపేశాయి. ఫలితంగా సుమన్ తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే సుమన్ ఎదుర్కొన్న కేసుల గురించి జనాల్లో అనేక పుకార్లు ఉన్నాయి. కానీ జరిగిన వాస్తవ సంఘటన వేరు.

సుమన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ దర్శకులు సాగర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. సుమన్ మెడకి చుట్టుకున్న వివాదం ఏంటి ? అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు ? ఎందుకు పెట్టారు అనే విషయాల్ని సాగర్ పూర్తిగా వివరించారు. ఇందులో ఉన్న అపోహల్ని, ఊహాగానాలని తొలగించారు. న్యూస్ క్యూబ్ యూట్యూబ్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో సాగర్ ఈ విషయాలు బయట పెట్టారు


ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి, డిజిపి చాలా పవర్ ఫుల్. లిక్కర్ కంట్రాక్టర్ కూడా ధనబలంతో పవర్ ఫుల్ గా ఉంటారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, రాష్ట్ర డిజిపి, లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్ ఈ ముగ్గురి వల్లే సుమన్ జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవల్ స్కెచ్ వేసి ఇరికించారు. కొన్ని బెయిల్ రాని కేసులు కూడా పెట్టారు. 

Suman Talwar

అప్పట్లో సుమన్ మంచి అందగాడు. డిజిపి కుమార్తెకి సుమన్ అంటే చాలా ఇష్టం . కానీ సుమన్ కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు. ఆల్రెడీ ఆమెకు పెళ్ళైనప్పటికీ సుమన్ ని ఇష్టపడేది సుమన్ స్నేహితుడు ఒకడు వడయార్ కుమార్తెని ప్రేమించాడు. డిజిపి కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళేది. 

దీనితో సుమన్, డిజిపి కూతురు వ్యవహారం ఎంజీఆర్ వద్దకు వెళ్ళింది. దీనితో ఎంజీఆర్ సుమన్ ని పిలిపించాడు. ఆయన అప్పట్లో మాట్లాడే స్థితిలో లేరు. ఏమైనా చెప్పాలనుకుంటే రాసి చూపించేవారు. బాబు నువ్వు నటుడివి. ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ చెప్పారు. 

దీనితో సుమన్ ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది.. ఆ అమ్మాయికి అని సున్నితంగానే ఎంజీఆర్ తో అన్నారట. అది రాంగ్ వేలో వెళ్ళింది. సుమన్ చెప్పిన సమాధానం ఎంజీఆర్ కి నచ్చలేదు. దీనితో డిజిపి తన బలం ఉపయోగించి సుమన్ పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు. లోలోపల చాలా కేసులు బనాయించారు. కానీ బ్లూ ఫిలిం కేసు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది. అవన్నీ వట్టి పుకార్లు అని సాగర్ కొట్టిపారేశారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది. ఆ విధంగా అపుకార్లు వచ్చాయి అని అన్నారు. 

Suman Talwar

కొన్ని నెలల పాటు సుమన్ జైల్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మగారికి గవర్నర్ బాగా తెలుసు. కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది. కానీ బయటకు వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు. ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాగర్ తెలిపారు. అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఇన్వాల్వ్ మెంట్ ఉండనే పుకార్లు అప్పట్లో పత్రికల్లో వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు అని సాగర్ అన్నారు. ఆవంత పనికిమాలిన ఊహాగానాలు అని అన్నారు. 
 

Latest Videos

click me!