శోభన్ బాబు తర్వాత అంతటి అందగాడు, కరాటేలో బ్లాక్ బెల్ట్..అర్థరాత్రి అరెస్ట్ కావడంతో కెరీర్ పతనం

టాలీవుడ్ లో అందగాడు అంటే ముందుగా శోభన్ బాబు పేరు చెబుతారు. శోభన్ బాబు తర్వాత అంతటి అందం ఉన్న నటుడు ఒకరు ఉన్నారు. కానీ ఆయన అంతగా హైలైట్ కాలేదు. గుర్తింపు వస్తున్న తరుణంలో కెరీర్ ని చీకటి కమ్మేసింది.

Actor Suman about his arrest and jail life in telugu dtr

టాలీవుడ్ లో అందగాడు అంటే ముందుగా శోభన్ బాబు పేరు చెబుతారు. శోభన్ బాబు తర్వాత అంతటి అందం ఉన్న నటుడు ఒకరు ఉన్నారు. కానీ ఆయన అంతగా హైలైట్ కాలేదు. గుర్తింపు వస్తున్న తరుణంలో కెరీర్ ని చీకటి కమ్మేసింది. ఆ నటుడు ఎవరో కాదు హీరో సుమన్. హీరో సుమన్ జీవితంలో ఎదుర్కొన్న వివాదం గురించి అందరికీ తెలుసు. 

Actor Suman about his arrest and jail life in telugu dtr
Suman

కానీ సుమన్ అరెస్ట్ అయిన రోజు సరిగ్గా ఏం జరిగింది అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ రోజు జరిగిన విషయాన్ని సుమన్ ఓ ఇంటర్వ్యూలో పూస గుచ్చినట్లు వివరించారు. ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొని సుమన్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారట.అర్థ రాత్రి అయింది. ఇంట్లో అందరం నిద్రపోతున్నాం. కుక్కలు అరిచే శబ్దం ఎక్కువగా వస్తోంది. వాచ్ మెన్ కాలింగ్ బెల్ కొట్టడంతో డోర్ తీశాను. 


Actor suman

చాలా మంది పోలీసులు వచ్చారు సార్.. మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పాడు. సరే రమ్మను అని చెప్పా.ఇంట్లోకి వచ్చి మొత్తం సోదాలు చేస్తున్నారు. ఏంటని అడిగితే సమాధానం లేదు. ఏమి దొరకలేదు అని చెప్పారు కానీ మీరు మాతో స్టేషన్ వరకు రావాలి అని అన్నారు. అలా నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. ఉదయం 5 అవుతోంది ఎవరూ సమాధానం చెప్పడం లేదు. మా అమ్మ, మేనేజర్ కి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. 

ఆ రోజు ఉదయం కోర్టుకి తీసుకెళ్లారు. నాపై అమ్మాయిలని హింసించాననే కేసు నమోదైంది. మరో కేసు కూడా పెట్టారు. నేను ఆ పని చేస్తున్నట్లు కేసులో నమోదైన టైంకి షూటింగ్ లో బిజీగా ఉన్నాను. దాని గురించి అడిగితే కేసు విచారణ జరుగుతోంది అని చెప్పారు. ఆ తర్వాత నన్ను మద్రాసు సెంట్రల్ జైలు కి తరలించారు. 

సుమన్ ని సాధారణ సెల్ లో కాకుండా చీకటి గదిలో ఉంచారట. కొన్ని రోజుల తర్వాత తనకి మద్దతుగా కరుణానిధి జైలుకి వచ్చినట్లు సుమన్ తెలిపారు. సుమన్ పై ఉన్న కేసు ఏంటి, ఆయనని మీరు ఎందుకు చీకటి గదిలో ఉంచారు అంటూ కరుణానిధి జైలు సూపరింటెండ్ పై విరుచుకుపడ్డారట. దీనితో సుమన్ ని వెంటనే సాధారణ గదికి బదిలీ చేశారు. కొన్ని నెలల తర్వాత సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటికే సినీ కెరీర్ పాడైపోయింది.సుమన్ అందగాడు మాత్రమే కాదు కరాటే బ్లాక్ బెల్ట్ సాధించి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న సమయంలో ఈ విధంగా కెరీర్ పతనం అయింది. అక్కడితో ఆగిపోకుండా సుమన్ తిరిగి కెరీర్ పారంభించి నటుడిగా అనేక చిత్రాల్లో నటించారు. 

Latest Videos

click me!