ఇంకా బ్యాచ్‌లర్‌గానే నటుడు సుబ్బరాజు.. 45ఏళ్లొచ్చినా పెళ్లి మాటెత్తకపోవడానికి వైరల్‌ అవుతోన్న షాకింగ్‌ రీజన్

Published : May 25, 2022, 12:53 PM ISTUpdated : May 25, 2022, 02:42 PM IST

 క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు (Subbaraju) సౌత్ ఆడియెన్స్ కు ఎంతగానో పరిచయం. ప్రతి స్టార్ హీరో సినిమాలో కనిపించే ఈ నటుడు 45 ఏండ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడం, అందుకు ఆయన చెప్పే రీజన్ షాకింగ్ గా ఉంది.   

PREV
16
ఇంకా బ్యాచ్‌లర్‌గానే నటుడు సుబ్బరాజు.. 45ఏళ్లొచ్చినా పెళ్లి మాటెత్తకపోవడానికి వైరల్‌ అవుతోన్న షాకింగ్‌ రీజన్

సినీ ఇండస్ట్రీలో స్టార్ కాస్ట్ తో పాటు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ యాక్టర్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. అందులోనూ పాత్రకు తగ్గట్టుగా నటించే సత్తా ఉన్న నటులకు మరింత మార్కెట్ ఉంది. అలాంటి జాబితాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు పేరు ముందు వరుసలో ఉంటుంది.
 

26

సాధారణంగా సినిమాల్లో నటించే హీరోహీరోయిన్ల వ్యక్తిగత జీవితం గురించి ప్రతి ఒక్కరికీ మినిమ్ తెలిసి ఉంటుంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల పర్సనల్ లైఫ్ బయటికి తెలియడం చాలా అరుదు. కొన్ని ప్రత్యేకమైన ఇంటర్వ్యూల్లో వారు తెలియజేస్తే తప్పా. గతంలో సుబ్బరాజు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి తెలియజేశాడు. 
 

36

ఈ సందర్భంగా 45 ఏండ్లుగా బ్యాచిలర్ గానే ఉండటానికి, తనకు పెళ్లిపై ఉన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు.  ‘అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో అర్థం కాలేదు. ఏపనైనా చేయాలంటే రీజన్ ఉంటుంది. చేయకపోవడానికి రీజన్ ఉండదు కదా. పెళ్లి పెద్దల కోసం చేసుకోవడం సరికాదు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. పెళ్లి చేసుకోవడం వేరు.. జరగడం వేరు. నాకు ఇష్టం ఏర్పడ్డప్పుడే పెళ్లి చేసుకుంటాను’ అని బదులిచ్చాడు.   

46

సుబ్బరాజు ఏపిలోనీ బీమవరంలో జన్మించాడు. అక్కడే ఆయన మ్యాథమెటిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరబాద్ కు వచ్చి కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లోని డెల్ కంప్యూటర్స్ లోనూ వర్క్ చేశాడు. ఆ జాబ్ తోనే యాక్సిడెంటల్ గా సినిమాల్లోకి వచ్చాడు. 

56

డైరెక్టర్ కృష్ణ వంశీ పర్సనల్ అసిస్టెంట్ ద్వారా ప్రకాశ్ రాజు, రవితేజ నటించిన ‘ఖడ్గం’తో చిన్న రోల్ దక్కించుకున్నాడు. అక్కడి నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు సుబ్బరాజు. అయితే ఈయన 2003 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించాడు.
 

66

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ నుంచి సుబ్బరాజు విభిన్న పాత్రల్లో నటించడం ప్రారంభించాడు. అంతకు ముందు నెగెటివ్ రోల్స్ చేసే ఈయన.. ప్రస్తుతం కామెడీ రోల్స్ కూడా చేస్తూ తనలోని నటనా నైపుణ్యాన్ని బయటికి తీసుకున్నారు. ఇటీవల ‘అఖండ, సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటించి అలరించాడు. 

click me!

Recommended Stories