ఆ మూవీకి ఆమె రాంగ్ ఛాయిస్..స్టార్ హీరోయిన్ ని శ్రీనివాస్ అవసరాల అంత మాట అనేశాడు ఏంటి..

Published : Mar 17, 2024, 02:52 PM ISTUpdated : Mar 19, 2024, 06:18 PM IST

టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ నటులు చాలా అరుదుగా ఉంటారు.అలంటి వారిలో ఒకరు శ్రీనివాస్ అవసరాల. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా శ్రీనివాస్ అవసరాల సత్తా చాటుతున్నారు. సున్నితమైన హావభావాలు పలికించడంలో శ్రీనివాస్ అవసరాల దిట్ట. 

PREV
16
ఆ మూవీకి ఆమె రాంగ్ ఛాయిస్..స్టార్ హీరోయిన్ ని శ్రీనివాస్ అవసరాల అంత మాట అనేశాడు ఏంటి..

టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ నటులు చాలా అరుదుగా ఉంటారు.అలంటి వారిలో ఒకరు శ్రీనివాస్ అవసరాల. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా శ్రీనివాస్ అవసరాల సత్తా చాటుతున్నారు. సున్నితమైన హావభావాలు పలికించడంలో శ్రీనివాస్ అవసరాల దిట్ట. ఆయన దర్శకత్వంలో కూడా క్లాసిక్ టచ్ కనిపిస్తుంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

26

శ్రీనివాస్ అవసరాలని వైవిధ్యమైన పాత్రలే వెతుక్కుంటూ వస్తాయి. కంచె, అంతరిక్షం, అమీ తుమీ లాంటి చిత్రాల్లో శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. ఇంకా చాలా చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ రోల్స్, లీడ్ రోల్స్ చేశారు. రీసెంట్ గా రవితేజ ఈగల్ చిత్రంలో కూడా నటించారు. 

 

36

ఇటీవల ఇంటర్వ్యూలో శ్రీనివాస్ అవసరాల ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ గురించి శ్రీనివాస్ అవసరాల అంత తక్కువగా అంచనా వేశాడు ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. శ్రీనివాస్ అవసరాల చెప్పింది స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి. 

 

46

అతడు మాట్లాడిన సినిమా ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. ఆ చిత్రం మహానటి. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. ఈ మూవీలో లీడ్ రోల్ లో హీరోయిన్ ఫిక్స్ కావడానికి ముందే నాగి (నాగ్ అశ్విన్) నన్ను కలిశారు. ఎల్వి ప్రసాద్ రోల్ లో నటించామని అడిగారు. నేను ఓకె చెప్పా. 

 

56

మహానటి సావిత్రి పాత్రలో సెట్ అయ్యే హీరోయిన్లు ఇప్పుడు ఎవరున్నారు ? నాగి ఎవరిని ఎంపిక చేస్తాడు అని ఉత్కంఠగా ఎదురుచూశా. కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారని ఒకరోజు నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు కీర్తి సురేష్ అంటే కమర్షియల్ హీరోయిన్ అనే అభిప్రాయం ఉండేది. దీనితో సావిత్రి గారిలాగా కీర్తి సురేష్ దుఃఖం, ఇతర ఎమోషన్స్ పలికించగలదా ? చాలా కష్టం అనుకున్నా. నాగి రాంగ్ స్టెప్ వేశాడు..కీర్తి సురేష్ ఈ చిత్రానికి రాంగ్ ఛాయిస్ అనుకున్నట్లు శ్రీనివాస్ అవసరాల అన్నారు. 

 

66

ఆ తర్వాత ఫస్ట్ లుక్ తో పాటు కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. వెంటనే నా అభిప్రాయం మారిపోయింది. కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది అని శ్రీనివాస్ అవసరాల అన్నారు. మహానటి చిత్రానికి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. 

 

click me!

Recommended Stories