శివాజీ సంచలనం... నానికి టైం వచ్చింది, ఒకడి వలన ఎన్టీఆర్ తో గ్యాప్ వచ్చింది, ఇంత వయసొచ్చింది ఎందుకురా బాబు.!

First Published Apr 24, 2023, 1:11 PM IST

సినిమాలకు దూరమైన నటుడు శివాజీ రాజకీయ ఆరోపణలు, విశ్లేషణలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ పొలిటికల్ కామెంట్స్ తో హీట్టెక్కించిన శివాజీ ప్రస్తుతం పరిశ్రమను టార్గెట్ చేసినట్లున్నారు. 
 

NTR

శివాజీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో పరిశ్రమలో కొందరు పెద్దవారు అవమానించారు. అన్యాయం చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. శివాజీ మాట్లాడుతూ... ఓ పెద్దాయన చనిపోతే చూసేందుకు ఇంటికి వెళ్ళాను. సాధారణంగా పరామర్శించేటప్పుడు కౌగిలించుకోవడం ఆనవాయితీ అలా చేయడానికి చూస్తే ఓ పెద్ద హీరో దూరం జరిగాడు. అంటే వాళ్ళను హగ్ చేసుకోవాలన్నా కూడా ఒక హోదా కావాలని అప్పుడు అర్థమైంది. పైకి మాత్రం ఆధ్యాత్మిక వచనాలు వల్లిస్తారు. చిన్న జీవితం అందరం చచ్చిపోతాం... ఇలాంటివి అవసరమా అనిపించింది. 
 

ఓ పెద్ద నిర్మాణ సంస్థలో పని చేస్తున్నాను. ఓ ప్రముఖ నటుడు రెమ్యూనరేషన్ గురించి అడిగాడు. నేను చెప్పాను. ఆ నిర్మాత దగ్గరకు వెళ్లి ఈ సినిమాలో అందరికంటే వాడికే ఎక్కువ ఇస్తున్నారట కదా. ఎందుకు వాడికి అంత అని చెప్పాడు. ఆ నిర్మాత నాకు పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. అందుకు నేను బాధపడలేదు. కానీ నమ్మి నా రెమ్యూనరేషన్ గురించి చెబితే ఆ నిర్మాతకు అలా చెప్పాల్సిన అవసరం ఏముంది. నీకు దేవుడు అంత  ఇచ్చాడు. ఇంత వయసు వచ్చింది. కనీస బుద్ధి ఉందా. చిన్న నటుడైనా పెద్ద నటుడైనా అవమాన పరచకండి. 
 

Latest Videos


నేను హీరోగా ఉన్న రోజుల్లో సోషల్ మీడియా లేదు.  మంచి సినిమాలు చేశాను. అప్పట్లో హీరోల పక్కన చేరి చాడీలు చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు హీరోలు చాలా స్మార్ట్. వాళ్లకు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. వాళ్లకు అన్నీ తెలుసు. నాని దసరా చేశాడు. వంద కోట్ల సినిమా అవుతుందని ఎవరైనా ఊహించామా.. అంతా టైం. పక్కా ప్రణాళిక వేసుకొని వెళ్తున్నాడు. అలా నేను చేయలేకపోయాను. 
 

sivaji


ఆది సినిమా వరకు ఎన్టీఆర్ నాతో చాలా బాగుండేవాడు. ఏమైందో తెలియదు సడన్ గా దూరమయ్యాడు. కనిపిస్తే జస్ట్ హాయ్ చెప్తాడు. మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. ఒకడి వలన గ్యాప్ క్రియేట్ అయ్యిందని నా అనుమానం. 

sivaji

సినిమాలు మానేయలేదు. మంచి పాత్ర వస్తే చేస్తాను. హీరోగా అవకాశాలు వచ్చినా చేస్తాను. ఆంధ్రప్రదేశ్ విభజన వ్యక్తిగతంగా నన్ను వేదనకు గురి చేసింది. అప్పటి నుండే సినిమాల మీద దృష్టి పెట్టలేకపోయాను. నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. సమాజ హితం కోసం మాట్లాడుతూ ఉంటాను... అని చెప్పుకొచ్చాడు. 

click me!