ఎదురుగా ఎవడో హీరో ఉంటే నోటికి వచ్చింది మాట్లాడతావా...  బండ్ల గణేష్ కి షకలక శంకర్ కౌంటర్లు 

First Published Jan 2, 2023, 6:40 AM IST

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కి నటుడు షకలక శంకర్ ఘాటైన సమాధానం చెప్పారు. మెగాస్టార్స్ అదృష్టం కొద్దీ అవరు, ఎదురుగా ఎవడో హీరో ఉంటే నోటికి వచ్చింది మాట్లాడతావా? అంటూ కౌంటర్స్ వేశారు... 
 

Bandla Ganesh

రవితేజ(Raviteja) ధమాకా మూవీ సూపర్ హిట్ కొట్టింది. మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హాజరయ్యారు. మైక్ అందుకున్న బండ్ల గణేష్ తన మార్క్ స్పీచ్ షురూ చేశాడు. హీరో రవితేజను ఆకాశానికి ఎత్తాడు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉండి, కష్టపడి, ఎవరి అండదండలు లేకుండా పైకి వచ్చాడని కొనియాడారు. 
 


పరిశ్రమలో అస్తమించని సూర్యడు రవితేజ అన్న బండ్ల గణేష్ తాను చేసిన 70 సినిమాలతో 12 మంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు అన్నారు. రవితేజ స్వయంకృషితో పైకొచ్చాడని చెప్పే క్రమంలో... ఒకటి రెండేళ్లు కష్టపడి అదృష్టం కలిసొచ్చి కొందరు మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ అయిపోతారు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన, చివరికి ప్రొడక్షన్ బాయ్ గా అయినా పరిశ్రమలోనే ఉంటానని స్టార్ అయ్యాడు, అని అన్నారు. 
 


మెగాస్టార్ బిరుదు చిరంజీవి(Chiranjeevi)దే కాబట్టి మెగా అభిమానులకు బండ్ల గణేష్ వ్యాఖ్యలకు నొచ్చుకున్నారు. ఆ ఫ్యామిలీ అభిమానిని అని చెప్పుకుంటూ... బండ్ల గణేష్ చిరంజీవిని తక్కువ చేసిన మాట్లాడారని ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ కామెంట్స్ కి నటుడు షకలక శంకర్ కౌంటర్లు ఇచ్చారు. కొంచెం ఘాటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. 
 

Puri jagannadh

మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ అదృష్టం కొద్దీ అవరు. దానికి ఏళ్ల తరబడి కృషి ఉండాలి. అన్నం నీళ్లు లేక, నిద్ర లేక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తే స్టార్స్ అవుతారు. మైక్ దొరకగానే, నీ ఎదుట ఎవడో హీరో కూర్చొని ఉండగానే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా... అది కరెక్ట్ కాదు. నా మాటలు తగలాల్సిన వాళ్లకు తగులుతాయి. పేరు చెప్పాల్సిన అవసరం లేదంటూ... ఫైర్ అయ్యాడు. 
 

Pawan Kalyan

ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో షకలక శంకర్ ఈ కామెంట్స్ చేశారు. ఇక షకలక శంకర్ పవన్(Pawan Kalyan) భక్తుడిగా చెప్పుకుంటాడు. మెగా ఫ్యామిలీ వీరాభిమానుల్లో అతడు ఒకడు. పవన్ కళ్యాణ్ ని కించపరిచేలా సినిమాలు చేస్తున్న వర్మపై షకలక శంకర్ ఒక మూవీ చేశాడు. పవన్ అభిమానులు ఈ చిత్రం నిర్మించగా వర్మ రోల్ షకలక శంకర్ చేశాడు. పవన్ ని ఎవరైనా విమర్శిస్తే షకలక శంకర్ రియాక్ట్ అవుతారు. 
 


మరోవైపు బండ్ల గణేష్(Bandal Ganesh)-పవన్ కళ్యాణ్ కి దూరం పెరిగినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సమయంలో బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ ని తిట్టాడు. అప్పటి నుండి పవన్ బండ్ల గణేష్ ని దగ్గరకు రానివ్వడం లేదు. పవన్ పై అసహనంతో ఉన్న బండ్ల గణేష్ ఆయన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్విట్టర్లో కామెంట్స్ పెడుతున్నారు. 

click me!