ఆ విషయం వినగానే కన్నీళ్లు ఆగలేదు, మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Published : Jan 01, 2023, 10:14 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎమోషనల్ కామెంటస్స్ చేశారు. మొదటి సారి మనసు విప్పి మాట్లాడారు. తాను ఎమోషనల్ అయిన క్షణాలనుగుర్తు చేసుకున్నారు. 

PREV
16
ఆ విషయం వినగానే కన్నీళ్లు ఆగలేదు, మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఏజ్ పెరుగుతున్న క్రేజ్ విషయంలో ఏమాత్రం తగ్గని హీరో. సినిమాల పరంగా టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో ఉన్న చిరంజీవి.. పర్సనల్ గా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఎమోషనల్ మూమెంట్స్ ను ఎన్నో అనుభవించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయట పెట్టారు చిరు. 

26

ఒక వార్త విని తనకు కన్నీళ్లు ఆగలేదంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయం చెపుతూ కూడా ఎమోషనల్ అయ్యారు చిరు. రామ్ చరణ్ , ఉపాసన తల్లి తండ్రులు కాబోతున్నారన్న వార్త విని కన్నీళ్ళు ఆపుకోలేకపోయానన్నారు. సంతోషం పట్టలేక భావోద్వేగానికి లోనయ్యాను అన్నారు మెగాస్టార్. 
 

36

మెగాస్టార్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ళుగా తాము ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. జపాన్ టూర్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన రామ్ చరణ్ ,  ఉపాసన.. రాగానే ఉపాసన తల్లి కాబోతున్నట్టు శుభవార్త చెప్పారన్నారు. ఆ వార్త వినగానే తాను, సురేఖ ఎంతో సంతోషించామన్నారు. 

46

అంతే కాదు. ఆ వార్త వినగానే తనకు కన్నీళ్ళు ఆగలేదన్నారు మెగాస్టార్. సంబరాన్ని ఆపుకోలేకపోయాన్నానరు. అయితే ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని చెప్పాలని ముందే అనుకున్నామన్నారు చిరు. అందుకే అప్పుడు ఈ విషయాన్ని వెల్లడించలేదట. 
 

56

ప్రస్తుతం మెగా వారసుడి కోసం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఎదరుచూస్తున్నారు. అంతే కాదు ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ కు అభినందనలు తెలుపుతున్నారు. 
 

66

 ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. ఈ నెల సంక్రాంతి కానుకగా 13న సినిమా రిలీజ్ కాబోతోంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో మెగాస్టరా్ జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది.  ఈమూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు లైన్ లో ఉంచారు మెగాస్టార్. 

click me!

Recommended Stories