చిరంజీవి, సురేఖ్ ఇద్దరూ తనని ప్రశంసించడంతో కెరీర్ కి మైలేజీ పెరిగింది అని ఓ నటుడు తెలిపారు. ఆ నటుడి కోసం ఓ సూపర్ హిట్ సినిమాని మళ్ళీ చూస్తాను అని చిరంజీవి అన్నారట.
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు, కమెడియన్లకు కూడా పోటీ ఎక్కువగానే ఉంది. పోటీని తట్టుకుని రేసులో నిలబడాలి అంటే ప్రేక్షకులని మెప్పించాలి. సక్సెస్ ఫుల్ చిత్రాలు పడాలి. తన తండ్రి టాలీవుడ్ లో తిరుగులేని నటుడు అయినప్పటికీ రఘుబాబు చాలా ఆలస్యంగా నటుడు అయ్యారు. ఆలస్యంగానే అతడికి పాపులారిటీ వచ్చింది. ఆలస్యంగా మొదలైనప్పటికీ రఘుబాబు ఇప్పటికీ తిరుగులేని నటుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.
25
బన్నీ సినిమాతో క్రేజ్
దివంగత నటుడు గిరిబాబు కుమారుడే రఘుబాబు. మురారి చిత్రంతో టాలీవుడ్ లో రఘుబాబుకి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆది, దిల్, బన్నీ సినిమాలతో పాపులర్ నటుడు అయ్యారు. బన్నీ సినిమా సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనని రఘుబాబు గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంతో రఘుబాబుకి మంచి క్రేజ్ వస్తుంది అని డైరెక్టర్ వివి వినాయక్ ముందే ఊహించారట. రఘుబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ మూవీ రిలీజై సక్సెస్ అయింది. అందరూ స్టేజీపై సినిమాలో నటించిన వారంతా బాగా నటించారు అని చెబుతున్నారు కానీ ఒక్కరు కూడా ప్రత్యేకంగా నా గురించి చెప్పడం లేదు.
35
రఘుబాబు కోసం మళ్ళీ చూస్తాను
వివి వినాయక్ గారు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమా మరోసారి చూడాలి అంటే మా బన్నీ కోసం చూడను.. మా రఘుబాబు కోసం చూస్తాను' అని అన్నారు. చిరంజీవి మాట్లాడిన ఆ మాట ఎంత గొప్పది. ఆ ఒక్క మాటతో నాకు మైలేజి వచ్చినట్లు అనిపించింది. అంతే కాదు.. సురేఖ గారికి కూడా నా నటన చాలా బాగా నచ్చింది అని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారు చెప్పిన ఆ మాట నా కెరీర్ కి చాలా ప్లస్ అయింది.
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చిరంజీవి గారి పుట్టిన రోజుకి నేను ఆయన ఇంటికి వెళతాను. అదే విధంగా జనవరి 1న కూడా వెళతాను. వెళ్లి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అని రఘుబాబు అన్నారు. చిరంజీవి గారితో తనకు మంచి అనుబంధం ఉంది అని రఘుబాబు తెలిపారు.
55
రఘుబాబు సినిమాలు
రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్ లో క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా రాణిస్తున్నారు. విక్రమార్కుడు, బన్నీ, యమదొంగ, బృందావనం లాంటి చిత్రాలు రఘుబాబుకి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.