పవన్ ఊసరవెల్లి, నమ్మడానికి వీల్లేదు...ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

First Published Nov 27, 2020, 1:59 PM IST

తెలంగాణా రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం, వాడివేడిగా సాగుతుండగా నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక ఊసరవెల్లిగా వర్ణించారు.

ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన బాణీ వినిపించారు. బీజేపీ పార్టీ మరియు నాయకులపై ఆయన నిప్పులు చెరిగారు.(photo courtesy:tv9)
undefined
బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు పలకడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పవన్ తనను పూర్తిగా నిరాశపరిచాడు అన్నాడు. అతను ఒక నాయకుడు, అతనికి జనసేన అనే రాజకీయ పార్టీ ఉంది. అలాంటి పవన్ బీజేపీ పంచన చేరడం ఏమిటని ప్రశ్నించారు.
undefined
తెలుగు రాష్ట్రాలలో పవన్ ఓటు షేర్ ఏమిటి? బీజేపీ ఓటు షేర్ ఏమిటని? అన్నాడు. కనీసం ఒక శాతం కూడా ఓటు షేరు లేని బీజేపీతో ఆయనకు పొత్తు అవసరమా అని పరోక్షంగా తెలియజేశారు.
undefined
మొదట్లో మోడీ మంచివాడని మద్దతు తెలిపాడు, ఆ తర్వాత మోడీ చెడ్డవాడని ప్రచారం చేశాడు. ఎన్నికల తర్వాత మళ్ళీ మోడీ గ్రేట్ లీడర్ అంటున్నాడు. ఇలా నాలుగైదు మాటలు మాట్లాడే పవన్ నాకు ఊసరవెల్లిలా కనిపిస్తున్నాడని ప్రకాష్ రాజ్ అన్నారు.
undefined
జాతి హితం కోసమే పవన్ బీజేపీలో చేరానని అన్నాడని, రిపోర్టర్ ప్రకాష్ రాజ్ ని అడుగగా...ఏది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏమి మంచి పనులు చేశారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
undefined
కేసీఆర్ తోనే హైదరాబాద్ సేఫ్ అని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీ రాకతో హైదరాబాద్ లో హిందూ-ముస్లిం మత ఘర్షణలకు కారణం అవుతారని హెచ్చరించారు.
undefined
దొంగల మాదిరి అశాంతి, గందరగోళం, సృష్టించి దోచుకునే ప్రయత్నం చేస్తారని చెప్పారు. పవన్ మరియు బీజేపీపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలుసంచలనం రేపుతున్నాయి.
undefined
మొదటి నుండి బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్, గత ఎన్నికలలో ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
undefined
click me!