పెళ్లి వార్తలను నరేష్ ఖండించారు. పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నానని ఆయన తెలియజేశారు. వివాహ వ్యవస్థపై నమ్మకం లేదన్న నరేష్... ప్రస్తుతానికి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకునే ఆలోచన లేదన్నారు. నమ్మకమైన, ప్రేమించే వ్యక్తి తోడు కావాలని కోరుకున్నాను. అందుకే పవిత్ర లోకేష్ తో కలిసి జీవిస్తున్నాను, అని స్పష్టత ఇచ్చారు.