Naresh-Pavitra Lokesh: రహస్య వివాహం తర్వాత మహాబలేశ్వర్ లో నరేష్-పవిత్ర లోకేష్... ఆ వార్తలకు బలం!

Published : Jun 22, 2022, 03:07 PM IST

నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వివాహం చేసుకున్నారన్న వార్తలు గత వారం రోజులుగా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నరేష్ కానీ, పవిత్ర లోకేష్ కానీ నోరు మెదపలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి మహాబలేశ్వర్ దేవాలయాన్ని సందర్శిచడం హాట్ టాపిక్ గా మారింది. 

PREV
16
Naresh-Pavitra Lokesh: రహస్య వివాహం తర్వాత మహాబలేశ్వర్ లో నరేష్-పవిత్ర లోకేష్... ఆ వార్తలకు బలం!
Naresh- Pavitra Lokesh

నటి విజయనిర్మల కుమారుడైన నరేష్ బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం హీరోగా మారి పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పరిశ్రమలో ఉన్న పరిచయాలు, టాలెంట్ కారణంగా ఆయనో బిజీ ఆర్టిస్ట్.

26
Naresh- Pavitra Lokesh


సక్సెస్ ఫుల్ ఆర్టిస్ట్ గా ఉన్న నరేష్ వ్యక్తిగత జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆయనకు రెండు పర్యాయాలు విడాకులు తీసుకున్నారు. రెండో భార్య రమ్య రఘుపతి అయితే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. అవి నరేష్ కి చుట్టుకోవడంతో ఆమెతో విడిపోయినట్లు స్పష్టత ఇచ్చాడు. 
 

36
Naresh- Pavitra Lokesh


ఇక చాలా కాలంగా నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. కన్నడ అమ్మాయి అయిన పవిత్ర లోకేష్ 1995లో నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేశారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం 2003లో విడుదలైన రవితేజ దొంగోడు. ఈ మూవీలో ఆమె హీరోయిన్ అమ్మపాత్ర చేశారు. 
 

46
Naresh- Pavitra Lokesh

2010 నుండి తెలుగులో ఎక్కువగా నటిస్తున్నారు. ఇక నరేష్ నటిస్తున్న చిత్రాల్లో పవిత్ర లోకేష్ కి కూడా అవకాశాలు దక్కుతున్నాయి. నరేష్ కారణంగానే ఆమెకు తెలుగులో ఆఫర్స్ దక్కుతున్నట్లు ఓ రూమర్ ఉంది. ఫైనల్ గా వారిద్దరి పెళ్లితో ఓ క్లారిటీ వచ్చింది.

56
Naresh- Pavitra Lokesh


నరేష్ పవిత్ర లోకేష్ రహస్య వివాహం చేసుకున్నారనేది తాజా వార్త. కారణం... పవిత్ర మొదటి భర్త నుండి అధికారికంగా విడిపోలేదు. ఆమె విడాకుల కేసు కోర్టులోనే ఉంది. ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఈ కారణంగా కేవలం సన్నిహితుల సమక్షంలో పవిత్ర లోకేష్, నరేష్ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారట. 

66

ఈ వార్తకు బలం చేకూర్చేలా తాజా ఘటన ఉంది. పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ దేవాలయం సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిద్దరూ జంటగా దేవాలయాలు సందర్శించడం, వస్తున్న పుకార్లు చూస్తుంటే వివాహం జరిగినట్లు స్పష్టత అవుతుంది. 

click me!

Recommended Stories