Narasimha Raju: అప్పట్లో యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే డైరెక్టర్లు కొట్టేవాళ్లు.. టాలీవుడ్ నటుడు

Published : Mar 29, 2026, 12:22 PM IST

Narasimha Raju: అలనాటి హీరో నరసింహ రాజు తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలోని ఒడిదుడుకులను పంచుకున్నారు. సావిత్రి కష్టాలు, దాసరితో ఉన్న అనుబంధం, తన సెకండ్ ఇన్నింగ్స్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
15
జానపద చిత్రాల రారాజు

జానపద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా, విట్లాచార్య ఆస్థాన హీరోగా గుర్తింపు పొందిన నరసింహ రాజు ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎన్.టి.ఆర్, కాంతారావు తర్వాత జానపద చిత్రాల్లో నరసింహరాజు తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా విట్లాచార్య దర్శకత్వంలో వచ్చిన 'జగన్మోహిని' వంటి చిత్రాలు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సమయంలో పెద్ద హీరోల సినిమాల మధ్య తన సినిమాలు విడుదలై అద్భుతమైన వసూళ్లు సాధించాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

25
దాసరితో అనుబంధం

తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన వారిలో దాసరి నారాయణరావు ఒకరని ఆయన పేర్కొన్నారు. 'తూర్పు పడమర' వంటి చిత్రాల ద్వారా సామాజిక చిత్రాల్లో కూడా ఆయన రాణించారు. ఒకానొక సమయంలో నటనకు విరామం ఇచ్చి దాసరి వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించానని, ఆ సమయంలో సంపాదించిన లాభాలతో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.

35
సావిత్రి చివరి రోజులు

మహానటి సావిత్రితో కొడుకుగా నటించిన అనుభవాలను పంచుకుంటూ, ఆమె చివరి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాల గురించి తనకు అప్పట్లో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు తెలిసి ఉంటే తప్పకుండా తన వంతు సహాయం చేసేవాడినని, ఆమె పట్ల స్టార్ హీరోలు ఇంకాస్త శ్రద్ధ చూపి ఉండాల్సిందని తన మనసులోని మాటను బయటపెట్టారు.

45
కుటుంబం, కెనడా ఆస్తులు

సినిమాలో రాణించాలంటే అదృష్టం, ఆర్థిక బలం ఉండాలని, అందుకే తన కొడుకును సాఫ్ట్‌వేర్ వైపు ప్రోత్సహించానని చెప్పారు. తన కొడుకు కెనడాలో స్థిరపడ్డాడని, అక్కడ ఆస్తులు ఉన్న మాట నిజమే కానీ ప్రచారంలో ఉన్నంత స్థాయిలో వందల కోట్లు కావని స్పష్టం చేశారు.

55
రెండో ఇన్నింగ్స్ ప్రారంభం

చాలా కాలం విరామం తర్వాత 'అనుకోని ప్రయాణం' లాంటి చిత్రాలతో మళ్లీ వెండితెరపై బిజీ అవుతున్నారు నరసింహ రాజు. రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం సీరియల్స్, సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆస్వాదిస్తున్నానని వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories