ప్రధాని మోదీకి ధనుష్ ట్వీట్... భగ్గుమంటున్న నెటిజన్లు!
ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్న వేళ, నటుడు ధనుష్ కూడా తన X ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు.
'సీఎం విజయ్ పుట్టినరోజుకు విష్ చేశారా?', 'బీజేపీ కూటమిలో చేరబోతున్నానని పరోక్షంగా చెబుతున్నారా?', 'తొలిసారి మోదీకి విష్ చేస్తున్నారు, ఇదెక్కడి కొత్త అలవాటు?' అని నిలదీస్తున్నారు. ధనుష్ ఫేమస్ డైలాగ్‌ను వాడి 'ఏం మేం బర్త్‌డే విష్ చేయకూడదా?' అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
అయితే, '2020లో కూడా ధనుష్ ప్రధాని మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు' అని ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క ట్వీట్‌తో ధనుష్ పెద్ద చర్చే లేవనెత్తారు. ఇది ఆయన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగా లేక మామూలు శుభాకాంక్షలా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.