ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి రేప్‌ చేయమన్నారు.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన `విక్రమార్కుడు` విలన్‌..

Published : Jan 07, 2023, 09:58 PM ISTUpdated : Jan 07, 2023, 10:49 PM IST

నటుడు అజయ్‌ విలన్‌ పాత్రలతో పాపులర్‌ అయ్యాడు. తాజాగా ఆయన ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. తనకు జరిగిన యాక్సిడెంట్‌, నేపాల్‌ పారిపోయిన విషయం, రేప్‌ చేసే సంఘటన గురించి ఓపెన్‌ అయ్యాడు. 

PREV
15
ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి రేప్‌ చేయమన్నారు.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన `విక్రమార్కుడు` విలన్‌..

నటుడు అజయ్‌ విలక్షణ నటుడిగా రాణిస్తున్నాడు. విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయిన ఆయన పాజిటివ్‌ రోల్స్ తోపాటు హీరోగానూ కనిపించాడు. హీరోకి ఫ్రెండ్‌గానూ విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. తాజాగా ఆయన ఏబీఎన్‌లో `ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే` టాక్‌ షోలో పాల్గొన్నారు. 
 

25

ఇందులో పలు ఆసక్తికర విషయాలను, షాకింగ్‌ విషయాలను వెల్లడించారు అజయ్‌. ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `విక్రమార్కుడు` చిత్రంలో విలన్‌ అయిన `తిట్ల`  పాత్రని పోషించారు. ఇది విలన్‌గా ఆయన పెద్ద గుర్తింపు, పెద్ద బ్రేక్‌ ని తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ఇంట్లో పిల్లలు తన వద్దకు కూడా రాలేదట. తిట్లా అని భయపడ్డారని చెప్పారు. దాదాపు పదిహేను ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ తనని `విక్రమార్కుడు` టిట్లా`నే అనుకుంటారని చెప్పారు. 
 

35

తనకు నేపాల్‌ పారిపోయిన విషయం గురించి ఓపెన్‌ అయ్యారు. నటుడుగా రాణించే క్రమంలో మధ్యలో ఆయన నేపాల్‌ పారిపోయాడట. అయితే తాను ఎందుకు అలా వెళ్లిపోయానో అర్థం కాలేదు. తీసుకెళ్లిన డబ్బులు అయిపోయాయట. దీంతో అక్కడ రెస్టారెంట్‌లో పనిచేయాల్సి వచ్చిందన్నారు. అక్కడ తనకు జ్ఞానోదయం అయ్యిందని చెప్పారు అజయ్‌. 
 

45

ఓ సినిమా షూటింగ్‌లో గాయాలయ్యాయని చెప్పారు. యాక్షన్‌ సీన్‌ చేసేటప్పుడు రోబ్‌ పట్టుకునే వాడు వెళ్లిపోయాడట. క్రేన్‌ మీదికి వచ్చి డమ్మి మెడపై తగిలిందట. క్రేన్‌ కాలుపై పడిందట. దీంతోవెంటనే చచ్చిపోయాడ్రా అనే అరుపు వచ్చిందట. ఆ క్షణంలో తనకు అందరూ గుర్తొచ్చారని తెలిపారు అజయ్‌. 
 

55

రేప్ సీన్ల గురించి ఆర్కే ప్రశ్నించారు. మీకు రేప్‌ సీన్లు చేయడం ఇష్టం ఉండదట అని అడగ్గా, షాకింగ్‌ విషయాల్లో రేపిస్ట్ పాత్రలకు తాను దూరం అని, అయితే ఓసారి విజయ్‌ మాస్టర్‌ ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్‌ చేయాలన్నారు. రేప్‌ చేయడమేంటి? అంటూ తాను షాక్‌ అయినట్టు చెప్పారు. అలాగే భాష రానప్పుడు ఎదురయ్యే ఫన్నీ సన్నివేశాలను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం అజయ్‌ `పుష్ప2`తోపాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మెయిన్‌ లీడ్‌గా `చక్రవ్యూహం` సినిమాలో నటిస్తున్నారు. సహస్ర క్రియేషన్స్ పతాకంపై సావిత్రి నిర్మించారు. చెట్కూరి మధుసూధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories