బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) కాపాడుకోవాలని, తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్, ప్రదర్శన వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకుండా ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అభిషేక్ బచ్చన్ న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ ప్రకారం.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అభిషేక్ బచ్చన్ పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు. ఆయన అనుమతి లేకుండా నకిలీ వీడియోలు, ఫోటోలు, అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నాయని తెలిపారు.
AI (కృత్రిమ మేధస్సు) ద్వారా అభిషేక్ బచ్చన్ ఫోటోస్ వాడుతూ డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన సంతకం, ఫోటోలను వాడి నకిలీ వస్తువులు, టీ-షర్టులు అమ్ముతున్నారని ఆరోపించారు.
అభిషేక్ పిటిషన్ పై కోర్టు స్పందిస్తూ, అభిషేక్ టీమ్ స్పష్టమైన URL లింకులు అందిస్తే, గూగుల్‌ను ఆ కంటెంట్ తొలగించమని ఆదేశించవచ్చని చెప్పింది. అయితే, యూట్యూబ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఒకేసారి ఆర్డర్ ఇవ్వలేమని, ప్రతి ప్రతివాదికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.