కోటి ఆశలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.. టాలీవుడ్ ఐటమ్ బాంబ్ అభినయశ్రీ. సాధ్యమైనంత వరకూ పోరాడుతానంది. ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మురిసి పోయింది. హౌస్ లో తనకు తగ్గట్టే ఉంటూ వచ్చింది. కాని అభినయశ్రీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి వెళ్లడం.. లోపల పరిణామాలు మారిపోవడం.. ఎలిమినేట్ అయ్యి అభినయశ్రీ బయటకు రావడం.. అంతా చకచకా జరిగిపోయాయి.
ఇక తాను బిగ్ బాస్ బయటకు రావడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది అభినయశ్రీ. ఈవిషయంపై ఆమె ఒకయూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అభినయశ్రీ మాట్లాడుతూ ..నా విషయంలో చాలా అన్యాయం జరిగింది. హౌస్ లో జరిగిన ఇంపార్టెంట్ సీన్స్ ప్లే అవ్వలేదు. ముఖ్యంగా నాకు సంబంధించిన క్లిప్స్ బయటికి పెద్దగా రాలేదు.. ఆ విషయం నేను బయటికి వచ్చిన తరువాత నాకు తెలిసింది అన్నారు.
హౌస్ లో తాను చాలా హుషారుగా ఉన్నానని, టైమ్ ప్రకారం తన ఎఫెర్ట్ పెట్టానని, గేమ్ లో కూడా బాగా ఆడానని అంది అభినయశ్రీ. అయితే అవేమి చూపించుకుండా.. తాను దిగాలుగా కూర్చుని ఉండటమే ఎక్కువగా చూపించారని వాపోయింది అభినయశ్రీ. నేను మాట్లాడింది...డాన్సులు చేసింది.. ఆర్గ్యుమెంట్ చేసింది ఏ ఒక్కటీ చూపించలేదంటూ బాధపడింది.
ఈ విషయంలో.. తాను బాగా డిజప్పాయింట్ అయ్యానంటోంది అభినయశ్రీ. ఓటింగ్ విషయంలో తనకంటే ధారుణమైన పొజిషన్ లో ఇద్దరు ఉన్నారని.. కానీ వాళ్లు సేవ్ అవ్వడం.. తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. అంతే కాదు వాళ్ళకంటే ఎన్నో రెట్లు బెటర్ పొజీషన్ లో ఉన్న తాను ఎలిమినేట్ కావడం షాక్ కు గురిచేసిందంటుంది ఐటం బ్యూటీ.
అంతే కాదు నాలోని టాలెంట్ ను చూపించుకోవడానికే నేను బిగ్ బాస్ కి వెళ్లాను. కానీ డే వన్ నుంచి తనకు సబంధించిన సీన్స్ ఏవీ సరిగ్గా చూపించలేదంటూ.. తాను బయటకు వచ్చిన తరువాత ఫ్రెండ్స్ తో పాటు అమ్మ కూడా చెప్పిందంటూ అభినయశ్రీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. బిగ్ బాస్ పై తన కోపాన్ని.. తన బాధను .. అవేదనను వ్యాక్తం చేసింది బ్యూటీ.
ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ..సీనియర్ ఆర్టిస్ట్ అనురాధ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది అభినయశ్రీ . వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ.. ఆతరువాత ఐటమ్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఐటమ్ సాంగ్స్ లో కూడా తన మార్క్ చూపించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక అదే టైమ్ లో ముమైత్ ఖాన్ గట్టి పోటీ ఇవ్వడంతో కాస్త డౌన్ అతయిన అభినయశ్రీ.. ఆతరువాత అస్సలు కనిపించడం మానేసింది.