ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన అమీర్‌ కూతురు ఐరా ఖాన్‌.. ఫోటోలు చూసి షాకవుతున్న నెటిజన్లు

Published : May 16, 2022, 02:18 PM IST

అమీర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఆమె ఇటీవల పంచుకున్న బర్త్ డే ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమారం రేపాయి. దారుణంగా ట్రోల్స్‌ కి గురయ్యాయి.

PREV
18
ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన అమీర్‌ కూతురు ఐరా ఖాన్‌.. ఫోటోలు చూసి షాకవుతున్న నెటిజన్లు

బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్ గా పేరుతెచ్చుకున్న అగ్ర హీరో అమీర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌(Ira Khan) గత వారం బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది. తన ప్రియుడు నుపూర్‌ శిఖారేతోపాటు తండ్రి అమీర్‌ ఖాన్‌, తల్లి రీనా దత్తా, తన ఫ్రెండ్స్ తో కలిసి ఐరా బర్త్ డేని జరుపుకుంది. అమీర్‌ ఖాన్‌ సమక్షంలో ఆమె కేక్‌ కట్ చేసింది. అయితే ఈ సందర్భంగా ఐరా ఖాన్‌ బికినీలో ఉండటం గమనార్హం. అమీర్‌ కూడా జస్ట్ నిక్కర్‌ ధరించి ఉన్నారు. 

28

అయితే బికినీలో తన బర్త్ డే (Ira Khan Birthday) సందర్భంగా కేక్‌ కట్‌ చేయడం వివాదంగా మారింది. నెటిజన్లు, ట్రోలర్స్ ఐరాఖాన్‌ని దారుణంగా విమర్శించారు. ట్రోల్స్ చేశారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తూ, ఫోటోలను వైరల్‌ చేశారు. ఇంట్లో బట్టల్లేవా? డ్రెస్సు వేసుకోవడం మర్చిపోయావా? ఇదేం అరాచకం అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కంటిన్యూగా ట్రోల్స్‌ చేస్తుండటంతో తాజాగా ఐరాఖాన్ స్పందించింది. 

38

ట్రోలర్స్ కి ఐరాఖాన్‌ గట్టిగా సమాధానం చెప్పింది. తాను ఇలానే ఉంటా? ఏం చేసుకుంటారో చేసుకోండి అనేట్టుగా ఆమె రియాక్ట్ అవ్వడం విశేషం. గతంలో తాను బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్న ఫోటోలను పంచుకుంది ఐరా. అయితే వీటిలో కూడా ఆమె బికినీలోనే ఉండటం విశేషం. అంటే తన బర్త్ డేని ఇలానే సెలబ్రేట్‌ చేసుకుంటాననే విషయాన్ని ఐరా లేటెస్ట్ ఫోటోల ద్వారా తెలియజేసింది. 
 

48

ఈ సందర్భంగా ఆమె పేర్కొంటూ చాలా మంది నా లాస్ట్ బర్త్ డే ఫోటోలను ట్రోల్స్ చేయడం, హేట్‌ చేయడం అయిపోయిందా?. ఎందుకంటే ఇక్కడ మరికొన్ని ఫోటోలు మీకోసం ` అంటూ పేర్కొంది ఐరా ఖాన్‌. ఫింగర్స్ చూపిస్తున్న, సెటైరికల్‌గా నవ్వుతున్న ఎమోజీలను పంచుకుంది. 

58

అప్పుడు కూడా తన ఫ్రెండ్స్, పేరెంట్స్ సమక్షంలోనే ఐరా ఖాన్‌ బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది. స్విమ్మింగ్‌ పూల్‌లో ఎంజాయ్‌ చేసింది. బికినీలోనే కనువిందు చేసింది. తాను ఎప్పుడూ ఇలానే బర్త్ డే చేసుకుంటున్నట్టు స్పష్టం చేస్తుంది ఐరా ఖాన్‌. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 
 

68

లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ ఫాతిమా సనా ఖాన్‌, తన ప్రియుడు నుపుర్‌ శిఖారేతోపాటు తన ఫ్రెండ్స్ ఉన్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో నుపుర్‌తో తెగ ఎంజాయ్‌ చేస్తుంది ఐరా ఖాన్‌. అలాగే ఫాతిమా సనా ఖాన్‌కి గట్టిగా ముద్దివ్వడం విశేషం.

78

ప్రస్తుతం ఈ పిక్స్ సైతం వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ, ట్రీట్‌ అదిరిందంటున్నారు. వాటికివి భోనస్‌ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 

88

ఐరా ఖాన్‌.. అమీర్‌ ఖాన్‌, ఆయన మొదటి భార్య రీనా దత్తాల కూతురు. వీరికి కూతురు ఐరాతోపాటు కుమారుడు జునైడ్‌ ఖాన్‌ ఉన్నారు. అమీర్‌ఖాన్‌, రీతా దత్తా 1986లో మ్యారేజ్‌ చేసుకున్నారు. 2002లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత మూడేళ్లకి అమీర్‌ 2005లో కిరణ్‌రావుని వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు గతేడాది విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.  వీరిద్దరు సరోగసి ద్వారా కుమారుడు అజాద్‌ రావ్‌ఖాన్‌ ని పొందారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories