Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. 59 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి రెడీ అయ్యారు. ఇప్పటికే 2 పెళ్లిళ్లు పెటాకులు కాగా..మూడో పెళ్లికి మూహూర్తం పెట్టుకున్నారు. అమీర్ ఖాన్ జీవితంలోకి రాబోతున్న ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ నెట్టింట క్షణాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన తర్వాత.. అమీర్ ఖాన్... త్వరలోనే మూడో పెళ్లికి సిద్ధమయ్యారట.
25
రెండు పెళ్లిళ్లు పెటాకులు
అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాను 1986 పెళ్లి చేసుకుని 2002లో విడాకులు ఇచ్చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాతే అమీర్ ఖాన్ 2005లో కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకుని 2021లో విడిపోయారు. వీరికి ఒక కొడుకు ఆజాద్ ఉన్నాడు.
35
జూలై 5 నాకెంతో ప్రత్యేకం: అమీర్ ఖాన్
అయితే ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు అమీర్ ఖాన్ స్వయంగా మీడియా ఎదుట డేట్ ఎనౌన్స్ చేశారు. జూలై 5 న పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇది చాలా చిన్న వేడుక అని, ఇంట్లోనే ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్దిమందినే ఆహ్వానిస్తునట్లు అమీర్ ఖాన్ చెప్పారు. ఈ జూలై 5 తనకెంతో ప్రత్యేకమన్నారు. అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.
అమీర్ ఖాన్ మూడో భార్య గౌరీ స్ప్రాట్.. సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి కాదు. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్, క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న ప్రముఖ వ్యక్తి. అమీర్ ఖాన్‌తో ఆమెకు కొంతకాలంగా మంచి పరిచయం ఉంది. ఆమె ప్రస్తుతం ముంబై, బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. అదే కాకుండా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారు.
55
శుభాకాంక్షలు తెలిపిన డైరక్టర్ రాజ్ కుమార్
అమీర్ ఖాన్ పెళ్లి డేట్ ఎనౌన్స్ చేస్తున్నప్పుడు పక్కనే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ఉన్నారు. ఆయన వెంటనే అమీర్ ఖాన్ కు శుభాకాంక్షలు చెప్పారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన త్రీ ఇడియట్స్, పీకే సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. అమీర్ ఖాన్ కొత్త జీవితం స్టార్ట్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇక దంగల్' సినిమాలో కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ తో పెళ్లి చేసుకుంటారనే వార్త గతంలో ప్రచారం జరిగింది. మొత్తానికి రెండు పెళ్లిళ్లు తర్వాత మూడో పెళ్లికి రెడీ అయిపోయారు..బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.