AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్

Published : Jan 14, 2026, 08:12 PM IST

అల్లు అర్జున్ 23 వ సినిమా ఫిక్స్ అయ్యింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న బన్నీ.. మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ తో సినిమాపై అఫీషియల్ అనౌస్స్ మెంట్ తాజాగా వచ్చింది. 

PREV
16
అల్లు అర్జున్ 23వ సినిమా ఫిక్స్..

చాలా కాలంగా అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమాపై వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందరు ఊహించిన విధంగా ఓ భారీ చిత్రం అధికారికంగా వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు ప్రకటించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌కు పని చేయనున్నారని కూడా స్పష్టం చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ 2026లో ప్రారంభం కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ 23వ సినిమాగా ఇది తెరకెక్కబోతోంది. చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని నిర్మాతలు పేర్కొన్నారు.

26
మరోసారి తమిళ దర్శకుడికే ఛాన్స్..

గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా రూపొందనుందనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూనే ఉన్నాయి. బన్నీతో పాటు మరికొందరు స్టార్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ విషయంలో అపీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తోన్న అల్లు అర్జున్, మరోసారి తమిళ దర్శకుడితో పని చేయనున్నారు.

36
సంక్రాంతి సందర్భంగా ప్రకటన..

అల్లు అర్జున్ 23వ సినిమాకు వర్కింగ్ టైటిల్స్‌గా #AALoki, #AA23, #LK7లను ఉపయోగిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా బన్నీ అభిమానులకు ఈ అద్భుతమైన ట్రీట్ ను అందించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అనౌన్స్‌మెంట్ వీడియోకు సోషల్ మీడియాలో భారీగా స్పందన వస్తోంది. అనిరుధ్ మార్క్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రూపొందిన ఈ వీడియోలో పలు జంతువులు, పక్షుల యానిమేషన్ విజువల్స్‌తో పాటు అల్లు అర్జున్ కళ్లను చూపిస్తూ ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు.

46
2026లో షూటింగ్ ప్రారంభం

2026లో షూటింగ్ ప్రారంభమవుతుందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌పై అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. “నా 23వ సినిమా కోసం ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాను. లోకేష్ గారు మెంటల్‌గా లాక్ చేశారు. మావెరిక్ డైరెక్టర్‌తో ఈ ప్రయాణం గురించి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఎట్టకేలకు అనిరుధ్‌తో వర్క్ చేయబోతున్నాను” అని అల్లు అర్జున్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాను మాసివ్ బ్లాస్ట్‌గా మార్చుదాం.. అని అభిమానులకు పిలుపునిచ్చారు అల్లు అర్జున్.

56
అట్లీతో శరవేగంగా సాగుతోన్న సినిమా..

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో #AA22xA6 సినిమాను చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమా కోసం ముంబయ్ కి మకాం మార్చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో మూవీ చేస్తాడా అన్న విషయంలో.. పలువురి పేర్లు వినిపించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సంజయ్ లీలా బన్సాలీ, సుకుమార్ పేర్లు బయటకు వచ్చాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. 

66
లోకేష్ కనగరాజ్ సినిమాలు..

లోకేష్ కనగరాజ్ తన సినిమాతో సౌత్ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘మా నగరం’, ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘లియో’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సాధించాడు లోకేష్ కనగరాజ్. ఈమధ్య రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కూలీ’ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘ఖైదీ 2’ తెరకెక్కుతుందని ప్రచారం జరిగినా, అనూహ్యంగా అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్ట్ తెర ముందుకు వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories