నాటుకోడి, బాదంపాలు, యాపిల్ జ్యూస్... సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...?

First Published Jan 18, 2024, 12:03 PM IST

నవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు.. తెలుగుసినీపరిశ్రమకు ఓ కీర్తి మకుటం, రాష్ట్ర రాజకీయాలను మార్చిన సంచలనం. ఆయన  గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే మాత్రం ఆయన ఫుడ్ హ్యాబిడ్స్ గురించే మాట్లాడుకోవాలి.  పెద్దాయన ఎంత మంచి భోజన ప్రియడో తెలుసా.. ? ఆయన ఇష్టంగా ఏం తినేవారంటే..? 
 

ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు.. స్లిమ్ గా ఉండాలి.. సిక్స్ ప్యాక్.. జీరో ప్యాక్ అంటూ.. తినడం మానేసి.. ప్రోటీన్ షేక్ ల పై ఆధారపడిఉంటున్నారు. కాని ఒకప్పుడు ఇవేవి లేవు. అన్నగారు,ఎఎన్ ఆర్ గారు కూడా కడుపునిండా తిని.. కసరత్తులు చేసేవారు.. తిండికలిగితే కండ కలదోయ్ అన్న సూత్రాన్ని నమ్మేవారు. ఇక పెద్దాయన ఎన్టీఆర్ అయితే.. ఒక నాటు కోడి తందూరీని ఏకంగా తినేసేవారట. ఇంతకీ ఆయన ఫుడ్ హ్యాబిడ్స్ ఇంకా ఎలా ఉండేవి.. ఆయన ఇంకా ఏవి ఇష్టంగా తినేవారంటే..? 

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తిరుగులేని శక్తిగా అవతరించి జనాలచేత దేవుడిగా కీర్తించబడ్డ వ్యక్తి ఎన్టీఆర్. సిద్థాంతాలకు మారు పేరుగా నిలిచిన ఎన్టీఆర్, షూటింగ్ టైమ్ తో పాటు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండేవారట. ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5 గంటల 45 నిమిషాలకు సెట్ కు చేరుకునేవారట ఎన్టీఆర్.  అలా ఉండాలి అంటే ఆయన ఎప్పుడు లేవాలి..? 

Latest Videos


డైలీ మూడున్నర నుంచి  నాలుగు గంటల మధ్యలో నిద్రలేచేవారు ఎన్టీఆర్.. రాత్రి తొమ్మిదిలోపు పడుకునేవారట. ఉదయం చీకటితోనే ఆయన దినచర్య స్టార్ట్ చేసేవారు. షూటింగ్స్, పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రం రాజీ పడే వారు కాదట. ముఖ్యంగా అరచేతి మందంతో ఉన్న ఇరవై ఇడ్లీలను ఎన్టీఆర్ అవలీలగా తినేసేవారట. ఇడ్లీతో నాటుకోడిని నంజుకోవడాన్ని పెద్దాయన బాగా ఎంజాయ్ చేసేవారట. 

ఉదయం అల్పాహారంలో 15 ఇడ్లీలుతిని.. షూటింగ్ గ్యాప్ లో మరికొన్ని తినేవారట.  ఎన్టీఆర్ ఎంత తింటారో.. అంతకంటే ఎక్కువగా కష్టపడేవారట. ఒక రోజుకు మూడు షిఫ్ట్ ల చొప్పున పనిచేసేవారట పెద్దాయన. రెండుషూటింగ్స్ లో కూడా పాల్గొనేవారట. అయితే ఈ షూటింగ్ గ్యాప్ లో.. స్టోరీ డిస్కర్షన్స్ లో కూడా ఆయన ఫుడ్ గురించి పక్కాగా మాట్లాడేవారట. పెద్దాయన నాన్ వేజ్ తో పాటు వెజ్ కూడా ఇష్టంగా తినేవారట. ముఖ్యంగా పళ్ల రసాలు అంటే ఆయనకు  చాలా ఇష్టమట. 

సీనియర్ ఎన్టీఆర్ కు  యాపిల్ జ్యూస్ అంటే ప్రాణం.. ఆయన ఎక్కువగా ఆపిల్ జ్యూస్ ఇష్టంగా తాగేవారట. మద్రాసులో ఉన్న టైమ్ లో  యాపిల్స్ ఎక్కువగా ఎక్కడ  బాగుంటాయో కనుక్కుని మరీ.. అక్కడి నుంచి తెప్పించుకునేవారట.ఒక రోజుకు 3 నుంచి 5 లీటర్ల యాపిల్ జ్యూస్ తాగేవారట ఎన్టీఆర్. సమ్మర్ లో ఈ కోటా పెరిగేదట. ఇక సమ్మర్ వస్తే.. ఈ యాపిల్ జ్యూస్ కు బాధం పాలు కూడా యాడ్ అయ్యేవట. రోజుకు రెండు లీటర్ల బాదాం పాలు తాగేవారట నట సార్వభౌముడు.  మధ్యాహ్నం భోజనం తర్వాత జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకొని తాగేవారట.

సాయంత్రం సమయంలో స్నాక్స్ గా బజ్జీలు తినటం ఎన్టీఆర్ కు అలవాటు. అలాగే డ్రైఫ్రూట్స్ ను కూడా ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారట. దానివల్ల అలసట రాదని కో ఆర్టిస్ట్ లకు తన స్నేహితులైన హీరోలకు సలహా ఇచ్చేవారట. ఇక సీనియర్ ఎన్టీఆర్ భోజనంలో రెండు మూడు రకాల కూరలు, పెరుగు, నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెపుతారు.

నాన్ వెజ్ అంటే ఆయనకు మహా ప్రీతి. నాటు కోడిని ఇష్టంగా లాగించేవారట. మంచి బియ్యంతో చేసిన అన్నం, కోడికూర, పెరుగు, వెజ్ లో అయినా చారు, అప్పడం ఆయన మెనూలో ఉండాల్సిందే అని చెపుతారు. అయితే   ఎన్టీఆర్  కొత్త ప్రాంతానికి వెళ్తే.. అక్కడి రుచులను కూడా ఆస్వాదించేవారట. ముఖ్యంగా రాజకీయల్లోకి వచ్చిన తరువాత చైతన్య యాత్రంలో ఆయన ప్రజలతో మమేకం అయ్యారు. ఎక్కడ టైమ్ దొరికితే.. అక్కడ ఏదుంటే అది తినేవారు. సౌకర్యలు లేని ఆ టైమ్ లో సాధారణ జీవితం గడిపి ఆదర్శంగా నిలిచారు నందమూరి తారక రామారావు.
 

నవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు.. తెలుగుసినీపరిశ్రమకు ఓ కీర్తి మకుటం, రాష్ట్ర రాజకీయాలను మార్చిన సంచలనం. ఆయన  గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన నట జీవితంలో కీర్తి పతాకాలెన్నో అందుకున్నారు. రాజకీయంగా కూడా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే మాత్రం ఆయన ఫుడ్ హ్యాబిడ్స్ గురించే మాట్లాడుకోవాలి.  పెద్దాయన ఎంత మంచి భోజన ప్రియడో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. 

click me!