నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎఫైర్ లో ఉన్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. విదేశాల్లో విహరిస్తున్న వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో సంచలన ఫోటో వెలుగులోకి వచ్చింది.
అక్కినేని హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2018లో గోవా వేదికగా సమంత-నాగ చైతన్యల వివాహం ఘనంగా జరిగింది. నాలుగేళ్లు అన్యోన్యంగా జీవించిన ఈ జంట అనూహ్యంగా విడిపోయింది. 2021లో నాగ చైతన్య-సమంత విడాకుల ప్రకటన చేశారు.
27
Naga Chaitanya-Sobhita Dhulipala
అనంతరం సమంత ఒంటరిగా జీవిస్తుంది. ఆమె వివాహం చేసుకోలేదు. అలాగే నాగ చైతన్య వివాహం చేసుకోలేదు. అయితే నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడనే వాదన ఉంది. నాగ చైతన్య-శోభిత తరచుగా కలుస్తున్నారని టాలీవుడ్ టాక్. తన కొత్త ఇల్లు నిర్మాణంలో ఉండగా నాగ చైతన్య ఆమెతో అక్కడకు వెళుతూ ఉండేవాడట.
37
నాగ చైతన్య టీమ్ అవి పుకార్లు మాత్రమే అని కొట్టి పారేశారు. నాగ చైతన్య-శోభిత ఎఫైర్ రూమర్స్ ని బలపరుస్తూ ఓ ఫోటో వైరల్ అయ్యింది. లండన్ లోని ఓ ఇండియన్ రెస్టారెంట్ కి నాగ చైతన్య, శోభిత వెళ్లారు. ఆ హోటల్ చెఫ్ నాగ చైతన్యతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
47
Naga Chaitanya-Sobhita Dhulipala
లండన్ హోటల్ చెఫ్ నాగ చైతన్యతో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సదరు ఫోటోలో దూరంగా కూర్చుని శోభిత దూళిపాళ్ల సైతం ఉన్నారు. ఆ ఫోటో మీడియాలో వైరల్ గా మారింది. ఆ చెఫ్ వెంటనే ఇంస్టాగ్రామ్ నుండి నాగ చైతన్యతో దిగిన ఫోటో తొలగించారు.
57
Naga Chaitanya-Sobhita Dhulipala
అప్పుడప్పుడు శోభిత-నాగ చైతన్య నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తున్నారని సమాచారం. వారిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ ఒక్కోసారి చాలా సిమిలర్ గా ఉంటున్నాయి. ఒకే చోట నుండి ఆ పోస్ట్స్ పెట్టారనే సందేహాలు కలిగేలా చేస్తున్నాయి.
67
Naga Chaitanya
తాజాగా మరోసారి శోభిత-నాగ చైతన్య అడ్డంగా బుక్ అయ్యారు. విదేశాల్లో విహరిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో నాగ చైతన్య, శోభిత పక్క పక్కనే కూర్చుని ఉన్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో శోభిత-నాగ చైతన్య మధ్య ఎఫైర్ నిజమే అన్న అనుమానాలు బలపడుతున్నాయి
77
ఇక నాగ చైతన్య కెరీర్ పరిశీలిస్తే... ఆయన పరాజయాల్లో ఉన్నారు. నాగ చైతన్య నటించిన థాంక్యూ, కస్టడీ చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.