పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. హీరో ఆర్యపై జర్మనీ మహిళ సంచలన ఆరోపణలు!

Published : Mar 02, 2021, 03:09 PM IST

కోలీవుడ్ హీరో ఆర్యపై ఓ మహిళా చీటింగ్ కేసుపెట్టారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 70 లక్షల నగదు తీసుకున్నాడంటూ సీరియస్ ఆరోపణలు చేశారు. ఆర్యపై ఓ మహిళ ఈస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 

PREV
16
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. హీరో ఆర్యపై జర్మనీ మహిళ సంచలన ఆరోపణలు!
శ్రీలంకకు చెందిన వెట్టా అనే మహిళ జర్మనీలో సెటిల్ అయ్యారు. ఆమెకు హీరో ఆర్యతో కొన్నాళ్లుగా పరిచయం ఉందట. దీనితో వెట్టాను పెళ్లి చేసుకుంటానని ఆర్య వాగ్దానం చేశారట.

Arya

26
అలాగే లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్స్ లేక, అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని చెప్పి,  రూ. 70లక్షల రూపాయలు తీసుకున్నాడట.

Arya

36
వెట్టా పెళ్లి ప్రస్తావన తెస్తున్న నేపథ్యంలో ఆర్య తన ఫోన్ ఎత్తడం మానేశాడట. అలాగే పలు మార్లు తనను చెప్పలేని భాషలో దుర్భాషలు ఆడాడని ఆ మహిళ అన్నారు.

arya

46
ఇక తనను పెళ్లి చేసుకోకపోగా... తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వనంటున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్యతో తన ఫోన్ ఆడియో రికార్డ్స్, డబ్బులు పంపిన వివరాలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది.

arya

56
అయితే ఆర్యపై వెట్టా చేస్తున్న ఆరోపణలను ఆయన ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సర్పట్టా అనే చిత్రంతో పాటు మరికొన్ని ఆఫర్స్ ఆర్య చేతిలో ఉన్నాయని, అలాగే 2019లో ఆర్య హీరోయిన్ సయేశాను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలుసు అంటున్నారు.

arya

66
మరి ఈ వ్యవహారంలో నిజం ఏమిటో బయటికి రావాలంటే మరి కొంత సమయం పట్టేలా ఉంది.

Arya

click me!

Recommended Stories