7Days 6 Nights Movie Review; 7 డేస్ 6 నైట్స్... మూవీ రివ్యూ... 

First Published | Jun 24, 2022, 7:37 PM IST

1998లో 6 డేస్ 7 నైట్స్ పేరుతో ఓ హాలీవుడ్ మూవీ వచ్చింది. ఆ మూవీతో ఎమ్మెస్ రాజు 7 డేస్ 6 నైట్స్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఆ విషయం పక్కన పెడదాం. ఎమ్మెస్ రాజు అంటే పరిశ్రమలో హిట్ చిత్రాలు నిర్మాతగా గొప్ప పేరుంది. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు.

7 days 6 Nights Review

వాన సినిమాతో ఎమ్మెస్ రాజు (MS Raju)దర్శకుడిగా మారారు. తర్వాత కొడుకు సుమంత్ హీరోగా తూనీగా తూనీగా చిత్రం చేశారు. ఈ రెండు ఏమంత విజయం సాధించలేదు. దీంతో పంథా మార్చి డర్టీ హరి టైటిల్ తో అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు. అది కూడా ఫలితం ఇవ్వలేదు. దర్శకుడిగా ఆయన ఐదో ప్రయత్నం 7 డేస్ 6 నైట్స్( 7Days 6 nights review) . జూన్ 24న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

7 days 6 Nights Review

కథ 
ఆనంద్ (సుమంత్ అశ్విన్)  కుమార మంగళం అలియాస్ మంగళం (రోహన్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఆనంద్ కి పెద్ద డైరెక్టర్ కావాలనేది కోరిక. ఇక మంగళంకి నటనపై ఆసక్తి. ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరికీ సినిమానే ప్రపంచం.  మంగళంకి వారం రోజుల్లో పెళ్లి అనగా బ్యాచిలర్ పార్టీ కోసం ఇద్దరు గోవాకు వెళ్తారు. పెళ్ళికి సిద్దమైన మంగళం  గోవాలో అమియా (కృతికా శెట్టి) అనే మరో అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆనంద్ మాత్రం కెరీర్ గురించి ఆలోచిస్తూ డిప్రెషన్ కి లోనవుతాడు. సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఆ క్రమంలో ఓ నిర్మాత ఆనంద్ కి దొరుకుతాడు. 


7 days 6 Nights Review

నిర్మాతకు కథ చెప్పిన ఆనంద్‌ డైరెక్టర్‌గా మారాడా? మంగళం, ఆనంద్ మధ్య స్నేహం ప్రాణం కంటే మిన్నగా ఎందుకు మారింది? ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లికి ముందు రోహన్ మరో అమ్మాయి ఆకర్షణకు గురయ్యాడు? ఆనంద్‌కు విన్నీ ఎందుకు దూరమైంది. ప్రేమ విఫలమైన ఆనంద్ గోవాలో పరిచయమైన రితిక (మెహర్ చాహల్)‌తో పరిచయం ఎంత వరకు వెళ్లింది?  అనేది తెరపై చూడాలి..

7 days 6 Nights Review


ఫ్రస్ట్రేషన్,డిప్రెషన్ లో ఆనంద్, వివాహ సంబరంలో మంగళం... ఇద్దరు స్నేహితుల కథను దర్శకుడు అలా ఓపెన్ చేశాడు.వాళ్ళిద్దరి మధ్య డ్రామా, డైలాగ్స్ తో కొంత ఫన్ జెనరేట్ చేయాలని దర్శకుడు చూశాడు. అయితే సినిమా  సాగదీతకు గురైంది. అందులోనూ ఎమోషనల్‌గా ఆకట్టుకొనే సన్నివేశాలు లేకపోవడం వల్ల ఫస్టాఫ్ కథ సాదాసీదా.. చిన్న హ్యుమర్ సంఘటనలతో ముందుకెళ్తుంది. కానీ సెకండాఫ్‌కు వచ్చే సరికి ఆనంద్‌లో భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ కథకు బలంగా మారాయనిపిస్తుంది. రోహన్ రొమాంటిక్ వ్యవహారం ఇంకాస్త ఘాటుగా ఉంటే.. కథకు మరింత ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ పెరిగి ఉండేదనిపిస్తుంది. క్లైమాక్స్‌లో దర్శకుడు సెన్సిటివ్‌గా డీల్ చేసిన అంశాలు యూత్‌కు మంచి ఫీల్‌ను కలిగిస్తాయి.

7 days 6 Nights Review

7 డేస్ 6 నైట్స్ మూవీని ఆనంద్ పాత్రలో కనిపించిన సుమంత్ ఆశ్విన్ ఎమోషనల్‌గా మార్చేశాడని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సాఫ్ట్ లవర్ బాయ్‌గా కనిపించిన సుమంత్.. భారమైన పాత్రలో ఎమోషనల్‌గా మెప్పించాడు. నటనపరంగా సుమంత్‌ కొత్తగా కనిపిస్తాడు. ఇక మంగళంగా రోహన్ ఎనర్జీ బాగుంది. తన పాత్ర ద్వారా మంచి ఫన్ క్రియేట్ చేశాడు. మొదటి సినిమా అయినప్పటికి అనుభవం ఉన్న నటుడిగా తెరపైన కనిపించాడు. రొమాంటిక్ సీన్లలోను, డైలాగ్, హావభావాలు, యాటిట్యూడ్ పరంగా ఆకట్టుకొన్నాడు. రితిక అలియాస్ రాట్స్‌గా నటించిన మెహర్ చాహల్‌లో గ్లామర్ ఫైర్ ఉంది. కానీ దర్శకుడు ఎంఎస్ రాజు సాఫ్ట్‌గా డీల్ చేయడం వల్ల మెహర్ గ్లామర్ ట్రీట్ పూర్తిగా అందించలేకపోయిందనే నిరాశ కనిపించింది. కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకొంటే.. ఇండస్ట్రీకి మంచి హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. గోపరాజు రమణ, మిగితా క్యారెక్టర్లు కథకు బలంగా కనిపించే క్యారెక్టర్లుగా ఉన్నాయి.
 

7 days 6 Nights Review


సమర్థ్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. జునైద్ ఎడిటింగ్ బాగుంది. ఇక నాని సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. గోవాలోని కొత్త ప్రదేశాలను, అందాలను తెరపైన కనులకు విందుగా మార్చడంలో నాని పనితీరు బాగుంది. సాహిత్యం, డైలాగ్స్ పరంగా చూస్తే.. చాలా క్లీన్ కంటెంట్‌ను ఇవ్వడానికి ఎంఎస్ రాజు తన అనుభవాన్ని రంగరించినట్టు కనిపిస్తుంది. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ & ఎబిజి క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
 

7 days 6 Nights Review

ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో కూడిన చిత్రం 7 days and 6 nights. ఇంకా ఈ కథకు ఎమోషనల్ పాయింట్స్ జోడించి ఉంటే.. బెటర్ రోడ్ జర్నీ, ట్రావెలగ్ మూవీ అయి ఉండేది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, యూత్‌ను టార్గెట్ చేసే అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. విజువల్ పరంగా బాగుంది. వీకెండ్‌లో ఫ్యామిలీ, యూత్ కలిసి చూడదగిన చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. తప్పకుండా సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

నటీనటులు: సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతికా శెట్టి, సుష్మ, రిషికా బాలి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ తదితరులు
రచన - దర్శకత్వం: ఎంఎస్ రాజు 
నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్ 
సంగీతం: సమర్థ్ గొల్లపూడి 
సినిమాటోగ్రఫి: నాని చమిడిశెట్టి
 ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ  

Rating: 2.5 
 

Latest Videos

click me!