హమ్ పంఛీ ఏక్ డాల్ కే' సినిమాలో జగదీప్ నటకునటనకు అప్పటి ప్రధాని నెహ్రూ మెచ్చి ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారంటే అతని ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 70 ఏళ్లపాటు నటుడిగా కొనసాగిన అరుదైన రికార్డ్ జగదీప్ సొంతం.
ఆ 70 ఏళ్లలో దాదాపు 400 సినిమాల్లో నటించారు జగదీప్. ఒక సినిమాను డైరెక్ట్ చేశారు కూడా. జగదీప్ కు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదటిగా నసీమ్ బేగంను చేసుకోగా వీరికి హుస్సేన్ జాఫ్రీ, షకీరా షఫీ, సురైయా జాఫ్రీ అనే ముగ్గరు పిల్లలు కలిగారు. ఇక రెండో భార్య సుఘ్రా బేగం వీరికి జావేద్ జాఫ్రీ, నావేద్ జాఫ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక మూడో భార్య నజీమా వీరికి ఏకైక సంతానం ముస్కాన్. వీరిలో జావేద్, నావేద్‌లు 'బూగీ వూగీ' షోతో, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.70 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీకి సేవ చేసిన జగదీప్ 81 ఏళ్ళ వయస్సులో.. అనారోగ్య సమస్యలతో జగదీప్ 2020, జులై 8న ముంబైలో కన్నుమూశారు. ఆయన ఆస్తి 100 కోట్లు ఉంటుందని అంచనా.