బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ మృణాల్ ఠాకూర్, సయీ మంజ్రేకర్, అనన్య పాండే తెలుగు చిత్రాల్లో నటించారు. మృణాల్ ఠాకూర్ కి భారీ బ్రేక్ దక్కింది. ఆమె హీరోయిన్ గా నటించిన సీతారామం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అనన్య పాండే, సయీ మంజ్రేకర్ లకు మాత్రం నిరాశ మిగిలింది. వీరు హీరోయిన్స్ గా నటించిన లైగర్, గని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే సయీ మంజ్రేకర్ కి మేజర్ రూపంలో హిట్ తగిలింది.