లైగర్,కాంతార,సాయి పల్లవి, రష్మిక.. 2022 సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన 10 వివాదాలు

Published : Dec 21, 2022, 06:46 PM IST

ఈ ఏడాది కరోనా నుంచి కోలుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద హిట్‌లతో విజృంబించిందనే చెప్పాలి. కాకపోతే అందులో కొంత మందికి నిరాశ కలిగితే..మరికొంత మంది మాత్రం హిట్ కొట్టి దిల్ ఖుష్ అయ్యారు. ఈ ఏడాది సినిమాల జోరుతో పాటు.. కాంట్రవర్సీల హోరు కూడా సాగింది. 2022 సౌత్ సినిమాకి వివాదాల సంవత్సరం కూడా మారిపోయింది. ఇక ఈఏడాది సౌత్ సినిమాలో ఏర్పడ్డ వివాదాలేంటి ఓ లుక్కేద్దాం, . 

PREV
110
లైగర్,కాంతార,సాయి పల్లవి, రష్మిక.. 2022  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన 10 వివాదాలు

అజయ్ దేవగణ్- కన్నడ హీరో కిచ్చా సుదీప్ మధ్య స్ట్రాంగ్ ట్విట్టర్ వార్ .. కన్నడ స్టార్ హీరో  దర్శన్ చెప్పుల దాడి నుండి నయనతార మరియు విఘ్నేష్ శివన్ సరోగసీ వరకు, సెలబ్రిటీలను ఇబ్బందుల్లో పడేసిన చాలా  విషయాలు ఈ ఏడాది జరిగాయి. మరి ఈ వివాదాలు ఎలా ఏర్పడ్డాయి..పరిష్కారాలు దొరికాయా లేదా..? 

210
dEVGAN kICHA sUDEEP

ఈఏడాది జరిగిన  వివాదాలలో మొదటిది.. పెద్దది..లాంగ్వేజ్ వార్. బాలీవుడ స్టార్ అజయ్ దేవగణ్, కన్నడ హీరో  కిచ్చా సుదీప్ మధ్య స్ట్రాంగా కౌంటర్లు కూడా పేలాయి. సుధీప్  ఓ కార్యక్రమంలో 'హిందీ జాతీయ భాష కాదు' అని చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఈ కామెంట్  బాలీవుడ్ హీరో  అజయ్ దేవ్‌గన్‌కి మింగుడుపడలేదు దాంతో వెంటనే సుధీప్ కుప్రశ్న సంధిచాడు.. మరి నీ సినిమాలను   హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నావు అని సుదీప్‌ను అడిగాడు. ఈ ఇష్యూ..ముదిరి పాకాన పడటంతో.. సౌత్ నుంచి వచ్చిన వ్యాతిరేకతను తట్టుకోలేక.. అజయ్ దేవగన్ క్షమాపణలు చెప్పడంతో  వివాదంసదర్ధుమణిగింది. 

310
Sai Pallavi

ఇక చాలా ఖచ్చితంగా ఉండే హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. తన అభిప్రాయాలను సూటిగా చెప్పేస్తుంది. కాని ఎప్పుడూ ఆమె వివాదాలలో చిక్కుకోలేదు. కాని ఒక్క సారి మాత్రం  సాయి పల్లవి, కాశ్మీర్ మారణహోమాన్ని ఆవు స్మగ్లింగ్ కోసం కొట్టిన హత్యలతో పోల్చి వివాదంలో చిక్కుకుంది. తాను సైద్ధాంతికంగా బ్యాలెన్స్డ్ గా ఉంటానని.. అణగారిన వర్గాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై చాలా మందినెటిజన్లు మండిపడ్డారు.  కాశ్మీర్ మారణహోమం, గోసంరక్షణకు సమానం కాదని ఒక వర్గం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు వివాదం అవ్వడంతో.. వాటి గురించి వివరణ ఇచ్చారు సాయి పల్లవి. 

410

ఈ ఏడాది పాన్ ఇండియా హిట్ సినిమాల్లో.. అన్ని భాషల్లో.. అందరిని ఆకట్టుకున్న సినిమా కాంతార. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈమూవీ 2022లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. కాని అంతే వివాదాలను కూడా ఫేస్ చేసింది మూవీ. దళితుల ప్రాతినిధ్యాన్ని ప్రశ్నించడం నుండి తైకుడంపై మోపిన దోపిడీ ఆరోపణల వరకు, కాంతార నిర్మాతలు వివాదాలు ఎదురుకున్నారు. కాంతార రిలీజ్ అయినప్పుడు ఇలాంటి వివాదాలు ఎన్నో పైకి లేశాయి. ఈ సినిమాలో స్త్రీ ద్వేషపూరిత సన్నివేశాలు ఉన్నాయంటూ విమర్షలు వచ్చాయి. మరో వైపు కేరళకు చెందిన కొందరు కాంతారలో వరాహం పాట.. తమన నవరసం పాటను కాపీ కొట్టి రూపొందించారంటూ ఆరోపించారు కోర్టులోకేసు కూడా వేశారు. అయితే ఈపాటపై అప్పటి వరకూ ఉన్న నిషాదాన్నికోర్డు కోట్టివేసింది. కాంతార సినిమాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 

510

ఇక ఈ ఏడాది జరిగిన మరో వివాదంనయనతార, విఘ్నేష్ శివన్ ల సరోగసి విషయం.  ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు విష్నేష్‌, నయనతారలు. ఇక  నాలుగు నెలల తర్వాత, అక్టోబర్ 9న, ఈ జంట  కవల పిల్లలు కలిగారంటూ అందరికి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు కూడా అప్ లోడ్ చేశారు. అయితే ఇంత త్వరగా పిల్లలు ఎలా కన్నారు. సరోగసి ద్వారానేనా అంటూ నెటిజన్లు ప్రశ్నించడం మొదలు పెట్టారు. డిసెంబర్ 2021లో, తమిళనాడు ప్రభుత్వం సరోగసీని నిషేధించింది.. దాంతో వీరు నిబంధనలకు విరుద్దంగా సరోగసీ చేశారంటూ.. విమర్షలు గుప్పుమన్నాయి. దాంతో తమిళ ప్రభుత్వం దీనీపై  విచారణకు ఆదేశించింది.వీరిద్దరూ 2015లోనే  పెళ్లి చేసుకున్నారని, మార్గదర్శకాలను పాటించారని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడైంది. దాంతో ఈ వివాదం సర్ధుమనిగింది. 
 

610

భారతదేశంలో అత్యంత ఇష్టపడే సెలబ్రిటీలలో రష్మిక మందన్న ఒకరు. అయితే రీసెంట్ గానే ఆమో ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇది దేశంలోనే చర్చనీయాంశం అయ్యింది. రష్మిక కాంతారను చూడలేదని మరియు ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టిపై అనుచితంగా మాట్లాడిందంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్ ఫేస్ చేసింది రష్మిక. అంతే కాదు కన్నడాలో లైఫ్ స్టార్ట్ చేసిన రష్మిక, తన మాతృబాషకు అన్యయం చేస్తుందంటూ..కన్నడిగులుమండి పడ్డారు. ఆ తర్వాత శాండల్‌వుడ్‌లో నటిపై నిషేధం విధించారనే రూమర్స్ హల్‌చల్ చేశాయి.అయితే, రష్మిక  ఈ వివాదంపై స్పందిస్తూ.. ట్రోలర్స్ ను ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అంతే కాదు తనపై నిషేదం విధించలేదంటూ... ఇన్ స్టాలో నోట్ ద్వారా వివరణ కూడా ఇచ్చింది బ్యూటీ. 
 

710

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. లైగర్ సినిమా వివాదం మరో ఎత్తు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాధ్ కాంబోలో రూపొందిన లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాన్టర్ గా నిలిచింది. టీమ్ మొత్తానికి  భారీ నిరాశను మిగిల్చింది. ఈ ఫెయిల్యూర్ ఛార్మిని సోషల్ మీడియా నుండి విరామం తీసుకునేలా చేసింది. చాలా మంది రాజకీయ నాయకులు తమ నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే ప్రయత్నంలో లైగర్‌లో పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్ నాయకుడు  ఆరోపించడంతో రిలీజ్ అయిన చాలా రోజుల తరువాత పూరీ, ఛార్మీ మరియు విజయ్ వివాదాల్లో చిక్కుకున్నారు.ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌లపై గంటల తరబడి విచారణ జరిపింది. ఈ కేసు ఇంకా నడుస్తోంది.

810
Dil Raju

ఇక ఈ ఏడాది  వివాదాలలో.. దళపతి విజయ్ వారసుడు, అజిత్ తునివు సినిమాల మధ్య వివాదం ఇంకా జరుగుతోంది.  ఈ రెండు సినిమాలు 2023 సంక్రాంతి బరిలో ఉన్నాయి. అయితే విజయ్ వారసుడు సినిమాకు  దిల్ రాజు నిర్మాత కాగా, తునివుకి పంపిణీదారుగా ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. తమిళనాడులో మెజారిటీ స్క్రీన్‌లను ఈ రెండు సినిమాలకు సమాన సంఖ్యలో కేటాయించారు. కానీ దిల్ రాజు ఇంకా ఎక్కువ స్క్రీన్ లు కావాలంటూ.. కొంత వివాదాస్పందగా మట్లాడాడు. మార్కెట్ పరంగా 'విజయ్ అజిత్ కంటే పెద్ద స్టార్' కాబట్టి ఉదయనిధిని కలుసుకుని మరిన్ని స్క్రీన్లు అడగబోతున్నట్లు దిల్ రాజు ఒక తెలుగు ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాంతో దిల్ రాజుపై గట్టిగా ట్రోలింగ్ నడిచింది. అంతే కాదు తమిళ నిర్మాలుకూడా మండిపడినట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు. 

910

ఇక కన్నడ స్టార్ హీరో  దర్శన్  ఈ ఏడాది రెండు వివాదాల్లో చిక్కుకున్నాడు. మొదట భరత్ అనే నిర్మాతను బెదిరించినందుకు దర్శన్‌పై పోలీసు కేసు నమోదైంది. ఆ తర్వాత తన  క్రాంతి సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు అదృష్ట దేవిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. "అదృష్ట దేవత ఎప్పుడూ తలుపు తట్టదు. ఆమె తట్టినప్పుడు, ఆమెను పట్టుకుని, మీ బెడ్‌రూమ్‌లోకి లాగి, వివస్త్రను చేయండి. మీరు ఆమెకు బట్టలు ఇస్తే, ఆమె బయటకు వెళ్తుంది.. అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. దాంతో ఈ కామెంట్స్  సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి దారితీసింది, చాలా మంది అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక ఆతరువాత జరిగిన  క్రాంతి ఆడియో ఈవెంట్ లో  దర్శన్ కర్ణాటకలోని హోసపేటలో ఉన్నప్పుడు, పునీత్ రాజ్‌కుమార్ అభిమాని అతనిపై చెప్పు విసిరాడు.ఇది ఇప్పటికీ సర్ధుమనగలేదు. 

1010

అటు మలయాళంలో కూడా కొన్ని వివాదాలు నమోదు అయ్యాయి. దర్శకుడిని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అనుచితంగా మాట్లాడటం దుమారం రేపింది. యంగ్ డైరెక్టర్ ను పట్టుకుని.. నెత్తిమీద జుట్టు లేదు కాని.. తెలివైన వాడు అంటూ.. మమ్ముట్టి మాట్లాడటంతో దూమారం రేగింది. దాంతో మమ్ముట్టి.. ఈవిషయంలో వివరణ ఇచ్చారు. ఇక మరో వివాదం మాలీవుడ్ ను కుదిపేసింది.  మలయాళ నటుడు శ్రీనాథ్ భాసి మహిళా జర్నలిస్టును అసభ్యంగా తిట్టాడనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అరెస్ట్ తర్వాత, నెటిజన్లు పాత వీడియోలను వెలికితీసి అతన్ని గట్టిగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories