నాగచైతన్య - శోభిత తో పాటు 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు

Published : Dec 06, 2024, 05:26 PM IST

నాగ చైతన్య-శోభిత నుండి సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్  వరకు, 2024 సంవత్సరం అనేక గ్లామరస్ వివాహాలకు వేదికైంది. ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న 10 సెలబ్రిటీ జంటలు ఎవరంటే..?

PREV
15
నాగచైతన్య - శోభిత తో పాటు  2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు
సెలబ్రిటీ వివాహాలు 2024

సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్, నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్లతో పాటు, రాకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ, పుల్కిత్ సామ్రాట్-కృతి ఖర్బందా, ఇరా ఖాన్-నుపుర్ శిఖారే వంటి ఇతర స్టార్ జంటలు 2024 లో పెళ్ళి చేసుకుని భార్య భర్తలుగా మారారు. 

25
రాకుల్-జాకీ, పుల్కిత్-కృతి వివాహాలు

రాకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ ఫిబ్రవరి 21, 2024న గోవా బీచ్ లో వీరి పెల్లి జరిగింది.  ప్రశాంతమైన వాతావరణం లో చాలా తక్కువ మంది సన్నిహితులైన అతిథుల మధ్య  రాకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ పెళ్ళి జరిగింది. పెళ్ళి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారికపుల్. 

పుల్కిత్ సామ్రాట్ - కృతి ఖర్బందా మార్చి 15, 2024న గురుగ్రామ్‌లో పెళ్లి చేసుకున్నారు, వారి వివాహ జీవితానికి నాంది పలికారు. ఈ పెళ్ళికి కూడా పెద్దగా ఆడంబరాలు చేయలేదు.  వారి వివాహం కుటుంబ సభ్యులు‌ - కొద్ది మంది  స్నేహితుల మధ్య జరిగింది. 

35
సుర్భి-కరణ్, ఇరా-నుపుర్ వివాహాలు

ఇరా ఖాన్ - నుపుర్ శిఖారే ఫిబ్రవరి 20, 2024న గోవాలో ఒక అందమైన బీచ్ లో వీరి పెళ్ళి జరిగింది. సముద్రపు ఒడ్డున.. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి వేదికపై అద్బుతంగా జరిగిన  ఇరా ఖాన్ - నుపుర్ శిఖారే పెళ్ళికి చాలా తక్కువ మంది బంధువులు వచ్చారు. 

45
సోనాక్షి-జహీర్ వివాహం

సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్:   వీరి వివాహం ఏప్రిల్ 22, 2024న ముంబైలో జరిగింది. ఈ గ్రాండ్ వేడుకకు బాలీవుడ్‌లోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట అందమైన ప్రయాణాన్ని ఆశీర్వదించడానికి బాలీవుడ్ కదిలివచ్చింది. 

55
హిమాన్ష్-వినీ వివాహం

హిమాన్ష్ కోహ్లీ - వినీ కోహ్లీ నవంబర్ 12, 2024న వివాహం చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ జంట వివాహం సన్నిహితులైన స్నేహితులు ‌-- కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలకు  హాజరైన ఆశీర్వదించారు. 


 

Read more Photos on
click me!

Recommended Stories