కరోనా విరాళాలు: తెలుగు సినీ తారలు సేమ్ టు సేమ్, పవన్ మాత్రమే తేడా..!

First Published Apr 4, 2020, 1:32 PM IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ భయానక వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిషలు శ్రమిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నంలో తమవంతు సాయంగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ స్థాయిక తగ్గట్టుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ విరాళాల విషయంలో పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు స్టార్స్‌.

బీజేపీ తో స్నేహం అందుకే అంతా భారీ విరాళం.... పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ అందరి కంటే ముందే భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఏకంగా రెండు కోట్ల సాయం ప్రకటించాడు. అయితే కేవలం ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్న పవన్‌, ఆంధ్రాతో పాటు తెలంగాణకు కూడా 50 లక్షల విరాళం ప్రకటించాడు. అయితే ఇటీవల బీజేపీతో దోస్తీ చేయటంతో ఆ స్నేహం మరింత బలపడటం కోసం అన్నట్టుగా కేంద్రానికి మరో కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు.
undefined
దానగుణంలోనూ బాహుబలి.... డార్లింగ్ ప్రభాస్ దానగుణం లోనూ బాహుబలి అనిపించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి చొప్పున ప్రకటించిన ప్రభాస్ కేంద్రానికి కూడా కోటి రూపాయలు అందించాడు. అయతే దీని వెనుక పెద్ద స్కెచ్‌ ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రభాస్ పెదనాన సీనియర్ నటుడు కృష్ణంరాజు బీజేపీ నాయకుడన్న విషయం తెలిసిందే. అందుకే ప్రభాస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోసం భారీ విరాళం ప్రకటించాడంటున్నారు.
undefined
మెగా ప్లానే వేరు... మెగా ఫ్యామిలీ విరాళాల విషయంలో సరికొత్త స్ట్రాటజీని ప్లే చేసింది. కేంద్రతో పాటు తెలుగు రాష్ట్రాలు రెండింటికి కలిపి 70 లక్షల విరాళం ప్రకటించాడు రామ్ చరణ్‌. అయితే మెగాస్టార్ చిరంజీవి కరోనా పై పోరాటానికి కాకుండా.. సినీ కార్మికులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో ఇండస్ట్రీలో చిరు తన పట్టును మరింత పెంచుకున్నాడు.
undefined
అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ కార్మికులకు మాత్రమే.... అక్కినేని ఫ్యామిలీ నుంచి కరోనాపై పోరాటానికి ఎవరు విరాళం ప్రకటించకపోవటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలున్న నాగార్జున ఒక్క రాష్ట్రానికి కూడా విరాళం ప్రకటించలేదు. కేవలం సినీ కార్మికుల కోసం కోటి రూపాయలు ప్రకటించాడు. తండ్రి బాటలోనే నాగచైతన్య కూడా సినీ కార్మికుల కోసం 25 లక్షలు విరాళం ప్రకటించాడు.
undefined
తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా.... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కొత్తగా ఆలోచించాడు. తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో పాటు కేరళకు కూడా తన సాయం ప్రకటించాడు బన్నీ. తెలుగుతో పాటు కేరళలోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్‌, అక్కడ అభిమానుల కోసం 25 లక్షల సాయం ప్రకటించాడు. అయితే బన్నీ సాయంలో మాత్రం ఎలాంటి పొలిటికల్ యాంగిల్ లేదు.
undefined
ఆంధ్రకు కూడా విరాళమిచ్చిన తెలంగాణ సూపర్‌ స్టార్.... కరోనా విషయంలో అందరికంటే ముందు స్పందించిన హీరో నితిన్. ముందుగా తెలంగాణకు 10 లక్షల రూపాయల సాయం అధించాడు. తరువాత అందరూ హీరోలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా మరో 10 లక్షలు విరాళం ఇచ్చాడు.
undefined
అదే బాటలో జూనియర్‌.... యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన వంతు విరాళం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన తారక్, కేంద్రానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు.
undefined
మహేష్ కూడా భారీగా..! సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా నేను సైతం అంటూ ముందుకు వచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ కేంద్రానికి విరాళం ప్రకటించలేదు.
undefined
మాటల మాంత్రికుడి సాయం తెలుగు వారందరికీ.... రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన వంతు సాయం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు.
undefined
సుప్రీం హీరో సాయం.. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తన వంతు సాయం అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు.
undefined
click me!