రెమ్యునరేషన్ డోస్ పెంచిన నేటితరం మ్యూజిక్ డైరెక్టర్స్

First Published Mar 21, 2020, 10:06 AM IST

ఒకప్పుడు కీ బోర్డు ప్లేయర్ గా.. వర్క్ చేసిన చాలా మంది సంగీత దర్శకులు ఇప్పుడు ఒక సినిమాను హిట్ చేసే స్థాయికి వచ్చారు. సినిమాలు హిట్టవ్వాలంటే ముందు మ్యూజిక్ తో కొట్టాలనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. అలాంటి కొంతమంది సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ పై ఒక లుక్కేస్తే.. 

థమన్ ఎస్ఎస్: అల.. వైకుంఠపురములో సినిమాతో థమన్ స్థాయి ఆకాశాన్ని దాటేసింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న  థమన్ ఒక కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్. మొదట్లో మణిశర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ వెయ్యి రూపాయలతో తన జీవితాన్ని మొదలుపెట్టాడు.
undefined
దేవి శ్రీ ప్రసాద్: ఈ రాక్ స్టార్ గత ఏడాది వరకు ఒక సినిమాకు 2కోట్ల లోపే తీసుకునేవారు. ఇక రీసెంట్ గా ఆయన వర్క్ చేస్తున్న సినిమాలకు 3కోట్లవరకు అందుకున్నట్లు తెలుస్తోంది. దేవి కూడా పలు సినిమాలకు సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసి కేవలం వందల్లో జీతాన్ని అందుకున్న సందర్భాలు ఎన్నో.. ఉన్నాయి.
undefined
MM.కీరవాణి: టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కంపోజర్ కీరవాణి ఎలాంటి సినిమా చేసినా అందులో ఒక్క పాటైనా వైరల్ అవుతుంది. రాజమౌళి సినిమాలకు అదిరిపోయేలా మ్యూజిక్ అందించే కీరవాణి 1.5కోట్ల వరకు అందుకుంటారని సమాచారం. కెరీర్ మొదట్లో తన ఉమ్మడి కుటుంబాన్ని మొత్తం తన భుజాలపై మోసిన కీరవాణి 1000 రూపాయల నుంచి కోటి వరకు వచ్చారు.
undefined
అనిరుద్ రవిచందర్: కొలెవరి సాంగ్ తో ప్రపంచాన్ని ఊపేసిన ఈ యంగ్ కంపోజర్ మొదటి సినిమాకు 5 లక్షలు తీసుకున్నాడు. ఇక 2కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు.
undefined
ఏఆర్.రెహమాన్: ఆస్కార్ విజేత రెహమాన్ 1000రూపాయల జీతం నుంచి తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఆయన ఒకరు. సినిమా మార్కెట్ ని బట్టి 10కోట్లకు పైగా డిమాండ్ చేస్తారని టాక్.
undefined
మణిశర్మ: 1990ల్లోనే ఒక పాటకు 90వేల వరకు అందుకున్న ఏకైక సంగీత దర్శకుడు మణిశర్మ. అనంతరం 50లక్షల వరకు వెళ్లింది. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ ని పారితోషికం తీసుకునేవారు. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.
undefined
శేఖర్ కమ్ముల - మిక్కీ జె మేయర్: హ్యాపీ డేస్ - లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు మిక్కీని సెలెక్ట్ చేసుకున్న కమ్ముల ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని రాబట్టాడు. మిక్కీ జె మేయర్: మహానటి వరకు 40లక్షల లోపే పారితోషికం అందుకున్న మిక్కీ ఇటీవల వరుస హిట్స్ తో 70లక్షలు దాటించినట్లు తెలుస్తోంది.
undefined
యువన్ శంకర్ రాజా: ఒక సినిమాకు 1.5కోట్లు
undefined
గోపి సుందర్: గీతా గోవిందం సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకున్న ఈ కంపోజర్ రేటు కూడా ఇప్పుడు 50లక్షలు దాటించినట్లు సమాచారం.
undefined
click me!