2019.. ఈ హిట్టు సినిమాల కోసం వారు పడ్డ పాట్లు..!

First Published Oct 19, 2019, 11:15 AM IST

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ హిట్ వస్తే హ్యాపీ అయిపోయి ఫ్లాప్ వస్తే బాధ పడిపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేం. ఫ్లాప్ వచ్చినా.. బౌన్స్ బ్యాక్ అయితే తప్ప ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోలేరు. 

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ హిట్ వస్తే హ్యాపీ అయిపోయి ఫ్లాప్ వస్తే బాధ పడిపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేం. ఫ్లాప్ వచ్చినా.. బౌన్స్ బ్యాక్ అయితే తప్ప ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోలేరు. అలా ఫ్లాప్స్ వచ్చినా డౌన్ అవ్వకుండా ఈ ఏడాదిలో మన తెలుగు దర్శకనిర్మాతలు బౌన్స్ బ్యాక్ అయి తమ సత్తా చాటుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
undefined
పూరి జగన్నాథ్ - ఈ డైరెక్టర్ సినిమాలకి మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ. కానీ ఈ సక్సెస్ లేక డీలా పడ్డాడు పూరి. అలాంటి సమయంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించి లాభాలు రుచి చూశాడు.
undefined
హరీష్ శంకర్ - 'గబ్బర్ సింగ్' తరువాత హరీష్ శంకర్ కి ఆ స్థాయి హిట్ పడలేదనే చెప్పాలి. మధ్యలో ఒకట్రెండు హిట్టు సినిమాలు తీసిన అతడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. ఇలా రీసెంట్ గా రీమేక్ కథ ఎన్నుకొని 'గద్దలకొండ గణేష్' సినిమా తీసి మాస్ హిట్ అందుకున్నాడు.
undefined
నందిని రెడ్డి - 'అలా మొదలైంది' సినిమా తరువాత 'జబర్దస్త్' తో ఫ్లాప్ అందుకుంది. ఆ తరువాత 'కళ్యాణ వైభోగమే' తీసినా ఏవరేజ్ గా ఆడింది. రీసెంట్ గా 'ఓ బేబీ' సినిమాతో తన సత్తా చాటింది.
undefined
రమేష్ వర్మ - ఒకప్పుడు 'వీర', 'అబ్బాయితో అమ్మాయి' లాంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు చాలా కాలానికి 'రాక్షసుడు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్నాడు.
undefined
కిషోర్ తిరుమల - 'నేను శైలజ' సినిమా తరువాత కిషోర్ తిరుమల తెరకేక్కిచిన 'ఉన్నది ఒకటే జిందగీ' ఆశించిన సక్సెస్ అందించలేకపోయింది. ఈ ఏడాది సాయి ధరం తేజ్ తో తీసిన 'చిత్రలహరి'తో సక్సెస్ అందుకున్నాడు.
undefined
వివేక్ ఆత్రేయ - ఇతడు తెరకెక్కించిన 'మెంటల్ మదిలో' సినిమా బాగున్నప్పటికీ అండర్ రేటెడ్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తరువాత 'బ్రోచెవారెవరురా' అంటూ మరో సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు.
undefined
ఛార్మి - పూరి జగన్నాథ్ తో కలిసి ఈ బ్యూటీ నిర్మించిన 'మెహబూబా' సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఈ ఏడాది ఆమె నిర్మించిన 'ఇస్మార్ట్ శంకర్' లాభాలు తీసుకొచ్చింది.
undefined
మహేష్ కోనేరు - 'నా నువ్వే'తో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ ఈ ఏడాది విడుదలైన '118' సినిమాతో నిర్మాతగా లాభాలను అందుకున్నాడు.
undefined
దిల్ రాజు - 'హలో గురు ప్రేమకోసమే', 'శ్రీనివాస కళ్యాణం', 'లవర్' వంటి సినిమాలతో వరుసగా ఫ్లాప్ సినిమాలు తీసిన దిల్ రాజు 'ఎఫ్ 2' బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది.
undefined
షైన్ స్క్రీన్స్ (సాహు గారపాటి, హరీష్ పెద్ది) - ఈ బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా 'కృష్ణార్జున యుద్ధం' ఫ్లాప్ అయింది. ఈ ఏడాదిలో చైతు హీరోగా వీరు నిర్మించిన 'మజిలీ' మంచి సక్సెస్ అందుకుంది.
undefined
click me!