పవన్, ప్రభాస్ కు అవసరం.. వాళ్లకు తప్పనిసరి.. మిస్సైతే అంతే సంగతులు!

First Published Jan 31, 2020, 9:23 AM IST

2020లో టాలీవుడ్ నుంచి అనేక ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. రవితేజ, అఖిల్, గోపీచంద్ లాంటి హీరోలకు ఈ ఏడాది కీలకంగా మారింది. తప్పనిసరిగా ఈ ఏడాది కొందరు హీరోలు విజయాన్ని అందుకోవాలి. ఆ వివరాలు ఇవే.

అఖిల్ : ఒక్క హిట్టు కోసం ఈ అక్కినేని హీరో ఎంతగా ఎదురుచూస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని ఫ్యాన్స్ లో భారీ అంచనాల నడుమ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు తొలి మూడు చిత్రాల రూపంలో షాక్ తగిలింది. భవిష్యత్తులో స్టార్ గా ఎదుగుతాడనే అంచనాలు అఖిల్ పై మెండుగా ఉన్నాయి. కనీసం ఈ ఏడాదైనా అఖిల్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో నటిస్తున్నాడు.
undefined
రవితేజ : మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ కే ప్రస్తుతం పెద్ద చిక్కొచ్చి పడింది. గత కొన్నేళ్లుగా రవితేజ చిత్రాలు విజయం సాధించడం లేదు. రీసెంట్ గా వచ్చిన డిస్కోరాజా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో అయినా రవితేజ హిట్ కొట్టాలి. లేకుంటే కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
undefined
గోపీచంద్ : గోపీచంద్ కు మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. కానీ ఆ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ హీరోకి విజయాలు దక్కడం లేదు. ముఖ్యంగా గోపీచంద్ నటించిన చివరి చిత్రాలు చాణక్య, ఆక్సిజెన్ తీవ్రంగా నిరాశపరిచింది.
undefined
నందమూరి కళ్యాణ్ రామ్ : నందమూరి కళ్యాణ్ రామ్ తో సక్సెస్ దోబూచులాడుతోంది. ఆ మధ్యన పటాస్ చిత్రం హిట్ అయింది. ఆ తర్వాత 118.. ఇప్పుడు మళ్ళీ ఎంత మంచి వాడవురాతో పరాజయాలు మొదలయ్యాయి. ఈ ఏడాది కళ్యాణ్ రామ్ హిట్ కొట్టడం తప్పనిసరి.
undefined
పవన్ కళ్యాణ్ : ఒకవైపు రాజకీయాలతో బిజీ.. రీసెంట్ గా పవర్ స్టార్ రీఎంట్రీ చిత్రం మొదలైపోయింది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ నుంచి మరో చిత్రం రాలేదు. ఇప్పటికిప్పుడు పవన్ హిట్ కొట్టనంత మాత్రాన వచ్చే ప్రమాదం లేదు. కానీ రీఎంట్రీ చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి.
undefined
బాలకృష్ణ : బాలయ్య చివరగా నటించిన రూలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బాలయ్యకు వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో బాలయ్యకు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం.
undefined
నితిన్ : యంగ్ హీరో నితిన్ కూడా సక్సెస్ ని ఎంజాయ్ చేసి చాలా రోజులే గడుస్తోంది. అ..ఆ తర్వాత నితిన్ కు హిట్ లేదు. ఈ ఏడాది నితిన్ నుంచి వరుస చిత్రాలు రాబోతున్నాయి. ఫిబ్రవరిలో భీష్మ చిత్రం రిలీజ్ కానుంది.
undefined
నాగార్జున : కింగ్ నాగార్జున బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపి చాలా కాలమే అవుతోంది. ఈ ఏడాది నాగ్ ' వైల్డ్ డాగ్'చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
undefined
రానా దగ్గుబాటి : అర్జెంట్ గా హిట్ కొట్టకుంటే రానా కెరీర్ వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం రానా పాన్ ఇండియా స్టార్. ఘాజి, బాహుబలి చిత్రాలతో రానాకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ రానా నుంచి పూర్తి స్థాయిలో ఓ కమర్షియల్ చిత్రం వచ్చి చాలా రోజులు గడుస్తోంది. ఈ ఏడాది రానా నుంచి విరాటపర్వం చిత్రం రాబోతోంది.
undefined
బెల్లంకొండ శ్రీనివాస్ : బెల్లంకొండ శ్రీనివాస్ చివరగా నటించిన రాక్షసుడు చిత్రం విజయం సాధించింది. కానీ కమర్షియల్ హీరో అనిపించుకోవాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. ఈ ఏడాది ఓ మంచి కమర్షియల్ హిట్ అందుకోవాలని శ్రీనివాస్ భావిస్తున్నాడు.
undefined
నిఖిల్ : నిఖిల్ చివరగా నటించిన చిత్రం అర్జున్ సురవరం. అంతకు ముందు నిఖిల్ కొన్ని ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. వాటితో పోల్చితే అర్జున్ సురవరం మంచి చిత్రం. ప్రస్తుతం నిఖిల్ ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది నిఖిల్ నుంచి కార్తికేయ 2 రాబోతోంది.
undefined
ప్రభాస్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రస్తుతం జాతీయ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోకల్ గా ప్రభాస్ కు తిరుగులేదు. కానీ నేషనల్ వైడ్ గా ఉన్న క్రేజ్ నిలబెట్టుకోవాలంటే బాహుబలి స్థాయిలో కాకున్నా ఓ మంచి హిట్ కొట్టాలి. బాహుబలి తెచ్చిపెట్టిన క్రేజ్ సాహో చిత్రంతో కొంత డ్యామేజ్ అయింది.
undefined
click me!