మన దర్శకుల కమ్ బ్యాక్ ఫిలిమ్స్ ఇవే..!

First Published Oct 8, 2019, 11:17 AM IST

కంటిన్యూస్ గా ఫ్లాప్స్ తరువాత మళ్లీ హిట్ కొట్టిన కొందరు దర్శకుల కమ బ్యాక్ ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం

సినిమా ఇండస్ట్రీలో హిట్ అనేది చాలా ముఖ్యం. కెరీర్ ని డిసైడ్ చేసేది హిట్ అనే మాటే.. ఇండస్ట్రీలో పనిచేసే వారికి హిట్స్, ఫ్లాప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అయితే ఫ్లాప్స్ నుండి బయటపడి మళ్లీ హిట్ కొడితే గానీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వలేరు. అలా కంటిన్యూస్ గా ఫ్లాప్స్ తరువాత మళ్లీ హిట్ కొట్టిన కొందరు దర్శకుల కమ బ్యాక్ ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
undefined
అప్పటివరకు వరుసగా ఫ్లాప్స్ అందుకున్న దర్శకుడు పూరిజగన్నాథ్ కి హిట్ రావాలని అభిమానులు సైతం ఎంతగానో కోరుకున్నారు. ఫైనల్ గా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.
undefined
తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన వినాయక్ 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి ముందు ఫ్లాపుల్లో ఉన్నాడు. చిరు రీఎంట్రీతో షాక్ ఇచ్చాడు.
undefined
'రంగస్థలం' సినిమాకి ముందు సుకుమార్ మార్క్ సినిమా పడలేదు. 'రంగస్థలం' వచ్చి తన సత్తా చాటింది.
undefined
తనకు నచ్చినట్లు సినిమాలు తీసుకునే తేజ చాలా ఫ్లాప్ సినిమాలు తీశాడు. అయితే 'నేనే రాజు నేనే మంత్రి'తో రొటీన్ సినిమాలకు బ్రేకప్ చెప్పి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు.
undefined
'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.
undefined
లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి 'జబర్దస్త్', 'కళ్యాణ వైభోగమే' వంటి ఏవరేజ్ సినిమాల తరువాత 'ఓ బేబీ' సినిమా తీసి తన టాలెంట్ నిరూపించుకుంది.
undefined
'ఇష్టం', '13బి' సినిమాల తరువాత విక్రమ్ కి సరైన బ్రేక్ రాలేదు. చాలా కాలం గ్యాప్ తరువాత నితిన్ తో తీసిన 'ఇష్క్' సినిమా తనకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
undefined
యువత, సోలో లాంటి డీసెంట్ సినిమాలు తీసిన పరసురాం కి మళ్లీ హిట్ పడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన 'గీత గోవిందం'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
undefined
'హ్యాపీ డేస్' సినిమా తరువాత శేఖర్ ఖమ్ముల తీసిన సినిమాలు బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాయి. ఆ తరువాత 'ఫిదా' సినిమా తీసి ఆడియన్స్ ని ఫిదా చేసేశాడు.
undefined
'లక్ష్యం' లాంటి హిట్ సినిమా తరువాత రెండు డిజాస్టర్ సినిమాలు తీశాడు దర్శకుడు శ్రీవాస్. ఆ తరువాత మరోసారి గోపీచంద్ తో 'లౌక్యం' అనే సినిమా తీసి హిట్ అందుకున్నాడు.
undefined
'అష్టాచమ్మా', 'గోల్కొండ హైస్కూల్' సినిమాల తరువాత మళ్లీ నానితో తీసిన 'జెంటిల్ మెన్' తో హిట్ ట్రాక్ లో పడ్డాడు ఇంద్రగంటి మోహనకృష్ణ.
undefined
click me!