భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమాలు

First Published Feb 6, 2020, 9:35 AM IST

మల్టీస్టారర్ సినిమాలు అంటే కథ చాలా బలంగా ఉండాలి. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం అంటే సాధారణమైన విషయం కాదు. అయితే రానున్న రోజుల్లో మరీన్నీ మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయని ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బిగ్ కాంబినేషన్స్ ని చూస్తే అర్ధమవుతోంది. ఇక సెట్స్ పై ఉన్న సినిమాలతో పాటు డిస్కర్షన్స్ లో ఉన్న ప్రాజెక్టులపై ఒక లుక్కేస్తే.. 

ఆర్య - అథర్వ బాలా దర్శకత్వంలో ఒక ప్రయోగాత్మకమైన సినిమాలో నటించబోతున్నారు. గṭగతంలో బాలా ఇద్దరు హీరోలతో చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ భారీ కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు 70కొట్లతో మరో మినీ మల్టీస్టారర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సూర్య కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.
undefined
F2 కథకు సీక్వెల్ గా దర్శకుడు ముగ్గురు హీరోలతో F3 అనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ అవుతోంది. వరుణ్ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. రవి తేజ - సాయి ధరమ్ తేజ అని ఇలా పలురకాల పేర్లైయితే వినిపిస్తున్నాయి.
undefined
విజయ్ - అజిత్: మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోలు కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నవారు. వీరి కలయికలో తప్పకుండా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ లో గత ఏడాది నుంచి టాక్ వస్తోంది.
undefined
రాండాముజమ్(మలయాళం) - మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ కు 1000 కోట్ల వరకు ఖర్చవుతుందట. మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో టాలీవుడ్ - కోలీవుడ్ అలాగే బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోలు వివిధ పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.
undefined
ప్రభాస్ - గోపీచంద్: కథ సెట్టయితే తప్పకుండా మల్టీస్టారర్ సినిమా చేస్తామని గోపీచంద్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే 300కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా ఎదిగిన ప్రభాస్ 30కోట్ల మార్కెట్ ఉన్న గోపితో వర్క్ చేస్తాడో లేదో?
undefined
రజినీకాంత్ - కమల్ హాసన్: ఈ ఇద్దరు స్టార్ హీరోలుగా మారిన తరువాత కలిసి నటించలేదు. స్టార్ దర్శకులు చాలా సార్లు వీరితో సినిమా చేయాలనీ అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. భవిష్యత్తులో మాత్రం ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని చాలా సార్లు కమల్, రజిననీలు మీటింగ్ లలో బహిరంగంగానే చెప్పారు.
undefined
పవన్ కళ్యాణ్ - చిరంజీవి - త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించడానికి సీనియర్ నిర్మాత పొలిటీషియన్ సుబ్బిరామిరెడ్డి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ గతంలోనే ఇచ్చారు. త్రివిక్రమ్ రెండు కథలను కూడా రెడీ చేశారు. ఆ సినిమా కోసం ఆయన 300 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని సుబ్బిరామిరెడ్డి డిస్కర్స్ చేశారు కానీ ఎందుకో కాలక్రమేణా ఆ ప్లానింగ్స్ కనుమరుగైపోయాయి.
undefined
సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ ని ఒకే తెరపై చూపాలని గత కొంతకాలంగా చాలా కథలు పుడుతున్నాయి. అయితే మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.
undefined
KGF 2 - ఫస్ట్ పార్ట్ తో కన్నడ ఇండస్ట్రీ మార్కెట్ ని ఒక్కసారిగా పెంచేసిన KGF సెకండ్ పార్ట్ లో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. ఆయన విలన్ గానే కనిపించినప్పటికీ సినిమాలో యష్ తో పాటు మరో స్టార్ హీరో కనిపిస్తాడని టాక్ వస్తోంది. 200కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
undefined
మహావీర్ కర్ణ - విక్రమ్ తన కెరీర్ లో చేస్తోన్న మొట్టమొదటి హై బడ్జెట్ మూవీ ఇది. 300కోట్ల వరకు ఖర్చు చేయనున్న ఈ హిస్టారికల్ సినిమాలో కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కనిపించనున్నట్లు సమాచారం.
undefined
విశాల్ - నాని: ఈ కాంబోలో మల్టీస్టారర్ మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్. యాత్ర దర్శకుడు మహి వీ రాఘవ ప్రస్తుతం ఈ కాంబినేషన్ ని పట్టాలెక్కించడానికి బిజీగా ఉన్నాడు.
undefined
నెక్స్ట్ రామ్ చరణ్ తారక్ లతోకలిసి మరో భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్లతో రుపొండుతోన్న ఆ సినిమా ఈజీగా రిలీజ్ కు ముందే 600 కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.
undefined
click me!