సినిమాలతో ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న స్టార్స్

First Published Feb 19, 2020, 9:13 AM IST

సినిమాల కోసం లైఫ్ ని రిస్క్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. పాత్ర కోసం బరువులు తగ్గుతూ పెరుగుతూ ఉండడం అంటే రిస్క్ అనే చెప్పాలి.. అలాగే ఉన్న డబ్బును సినిమా కోసం ధారపోయడం కూడా రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి ప్రయోగాలతో దెబ్బ తిన్న కొంత మంది సినీ తారలపై ఒక లుక్కేస్తే..

లడ్డుబాబు: అల్లరి నరేష్ కెరీర్ లోనే ఒక డిఫరెంట్ ప్రయత్నం లడ్డు బాబు. రవి బాబు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోసం నరేష్ భారీ ప్రాస్తటిక్ మేకప్ వేసుకొని కొన్ని వారాలపాటు కష్టపడ్డాడు. అయినా కూడా సినిమా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
undefined
ఐస్ క్రీమ్: రామ్ గోపాల్ వర్మ చేసిన ఎన్నో ప్రయోగాలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయినట్టే చాలా వరకు డిజాస్టర్ అయ్యాయి. కానీ ఐస్ క్రీమ్ సినిమా కోసం తెలుగమ్మాయి తేజస్విని ఎవరు ఊహించని విధంగా వంటిపై నూలు పోగు లేకుండా ఒక సిన్ లో నటించింది. అలాగే చాలా వరకు హాట్ గా కనిపించి తన గ్లామర్ ని మొత్తం ఆ సినిమా కోసం వాడేసింది. కానీ ఆ సినిమా బేబీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు.
undefined
ఐ - మనోహరుడు: విక్రమ్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కోసం విక్రమ్ ఏ స్థాయిలో కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా కోసం దాదాపు తన ప్రాణాలని పణంగా పెట్టి 40కేజీలు తగ్గి కొన్ని రోజుల పాటు ఒక యాపిల్ తోనే కడుపు నింపుకున్నాడు. అయినా సినిమా అనుకున్నంతగా సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.
undefined
బ్రదర్స్: సూర్య ద్విపాత్రాభినయంలో చేసిన మోస్ట్ డిఫరెంట్ ఫిల్మ్ బ్రదర్స్. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ప్రయోగం కోసం సూర్య ఒక రెండు సెకన్ల సీన్ కోసం కూడా 50కి పైగా టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఎంత కష్టపడినా సినిమా మాత్రం విజయాన్ని అందించలేదు.
undefined
నిజం: మహేష్ బాబు తన క్రేజ్ ని పక్కనపెట్టి చేసిన నిజం ప్రయోగం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం మహేష్ చాలా గాయాలకు గురయ్యాడు.
undefined
అంజి: అరుంధతి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో అప్పట్లో తెరకెక్కిన మెగాస్టార్ హై బడ్జెట్ మూవీ ఇదే. 1997లో మొదలైన ఈ సినిమా మధ్యలో ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది, మెగాస్టార్ డేట్స్ ని కూడా లెక్క చేయకుండా సినిమా కోసం ఎంతగానో శ్రమించారు. 2004లో రిలీజైన అంజి డిజాస్టర్ గా నిలిచింది.
undefined
నా పేరు సూర్య: అల్లు అర్జున్ ఈ సినిమా కోసం కొన్ని రోజుల వరకు ఇండియన్ ఆర్మీకి దగ్గరగా ఉండి పలు వర్కౌట్స్ పై అవగాహన పెంచుకున్నాడు. అలాగే సినిమాలో లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో.. పాట కోసం క్యాప్ ట్రిక్స్ తో డ్యాన్స్ చేశాడు. బన్నీ ఈ సినిమాతో కొత్త విషయాలు ఎన్నో చూపించినప్పటికీ సినిమా హిట్ కాలేకపోయింది.
undefined
విశ్వరూపం2: కమల్ హాసన్ బడ్జెట్ ని ఏ మాత్రం లెక్క చేయకుండా చేసిన ఈ సీక్వెల్ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది. యాక్షన్ సన్నివేశాల్లో కమల్ కష్టపడి నటించినప్పటికీ సినిమా క్లిక్కవ్వలేదు.
undefined
అంతరిక్షం: ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమా డిజాస్టర్ గా నిలిచింది. వ్యోమగామి పాత్ర కోసం వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కానీ సినిమా మొదటిరోజే డిజాస్టర్ టాక్ ను అందుకుంది.
undefined
సైజ్ జీరో: అనుష్క కెరీర్ లో మొదటిసారి గ్లామర్ ని పక్కన పెట్టి రిస్క్ చేసిన మూవీ సైజ్ జీరో. ఆ సినిమా కోసం స్వీటీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. 100కేజీలకు పైగా లావెక్కి అందరికి షాకిచ్చింది. ఆ సినిమా కోసం ఎంత కష్టపడినా బేబీకి సరైన విజయం దక్కలేదు. రాఘవేంద్ర రావ్ తనయుడు ప్రకాష్ ఆ సినిమాకు దర్శకత్వం వహించాడు.
undefined
నేనే దేవుడిని: బాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో ఆర్య - హీరోయిన్ పూజ చాలా కష్టపడ్డారు. సినిమాకు మంచి గుర్తింపు దక్కినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.
undefined
click me!