ఏం సందేహం లేదు.. ఆ అందాల నవ్వు.. మన సునీతదే

First Published Jan 23, 2020, 11:14 AM IST

సునీత సుప్రసిద్ధ నేపథ్య గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. ఈమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట. ఈమె 8 సంవత్సరాల కాలంలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.
 

సునీత సుప్రసిద్ధ నేపథ్య గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. ఈమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట.
undefined
ఈమె 8 సంవత్సరాల కాలంలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.
undefined
సునీత ఉపద్రష్ట నరసింహారావు మరియు సుమతి దంపతులకు జన్మించింది.
undefined
ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరు లోను, మరికొంత కాలం విజయవాడలోను చేసింది.
undefined
చిన్ననాటి నుండే సంగీతాన్ని అభిమానించి, ప్రేమించి విజయవాడలో సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యారావు వద్ద కర్ణాటక సంగీతంలోను మరియు కలగా కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందింది.
undefined
ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది.
undefined
శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది.
undefined
ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆమెకి టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి.
undefined
తెలుగు, కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది.
undefined
సునీత.. తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా సరన్, జ్యోతిక, ఛార్మి, నయనతార, సదా, త్రిష ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ చెప్పింది.
undefined
ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి అబ్బాయి ఆకాష్, కూతురు శ్రేయా ఉన్నారు.
undefined
అయితే కొన్నాళ్లకు ఆమె తన భర్తకు దూరమైంది.
undefined
ప్రస్తుతం సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది.
undefined
కెరీర్ పరంగా ఎన్నో జాతీయ అవార్డులు, నంది పురస్కారాలు అందుకుంది.
undefined
సోషల్ మీడియాలో కూడా ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది.
undefined
అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
undefined
click me!