'ఏరా నాకు రెమ్యునరేషన్ ఇస్తావా'.. చిరుపై షాకింగ్ కామెంట్స్, లైవ్ లో ఏడ్చేసిన రాధిక భర్త

Published : May 10, 2020, 12:32 PM ISTUpdated : May 10, 2020, 01:29 PM IST

మెగాస్టార్ చిరంజీవి, రాధిక వెండితెరపై సూపర్ హిట్ పెయిర్. అభిలాష, హీరో, దొంగ మొగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో వీరిద్దరి కాంబోలో వచ్చాయి. రాధిక భర్త తమిళంలో పేరుమోసిన నటుడు శరత్ కుమార్.

PREV
19
'ఏరా నాకు రెమ్యునరేషన్ ఇస్తావా'.. చిరుపై షాకింగ్ కామెంట్స్, లైవ్ లో ఏడ్చేసిన రాధిక భర్త

మెగాస్టార్ చిరంజీవి, రాధిక వెండితెరపై సూపర్ హిట్ పెయిర్. అభిలాష, హీరో, దొంగ మొగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో వీరిద్దరి కాంబోలో వచ్చాయి. రాధిక భర్త తమిళంలో పేరుమోసిన నటుడు శరత్ కుమార్. ఈ దంపతులిద్దరూ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తెలుగు మీడియాకు ఇంట్లో నుంచే ఇంటర్వ్యూలు ఇచ్చారు. 

29

ఈ ఇంటర్వ్యూలో రాధికా, శరత్ కుమార్ ఇద్దరూ తమ కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. అలాగే రాధికా చిరంజీవితో తన అనుబంధాన్ని పంచుకుంది. చిరంజీవి గారు, తాను కెరీర్ ఆరంభం నుంచే స్నేహితులం అయ్యాం అని, ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం అని పేర్కొంది. 

39

చిరంజీవిగారు తన కుటుంబంలో మంచి జరిగినా చెడు జరిగినా తనతో షేర్ చేసుకుంటారు అని.. అలాగే తమ కుటుంబ విశేషాలని కూడా తాను చిరంజీవికి చెబుతానని రాధిక పేర్కొంది. 

49

ఇక శరత్ కుమార్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో  తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని తెలిపాడు. చిరంజీవి గారు తనకు స్నేహితుడి కంటే ఎక్కువని అన్నారు.తన జీవితంలో జరిగిన ఓ అరుదైన సంఘటనని శరత్ కుమార్ బయట పెట్టారు. 

59

చిరంజీవి గారితో గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాల్లో నటించా. ఓ సమయంలో అప్పుల్లో చిక్కుకుపోయా. ఓ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఆ చిత్రాన్ని చిరంజీవిగారితో చేయాలని అనుకున్నాం. వెంటనే చిరంజీవి గారికి ఫోన్ చేసి మీతో మాట్లాడాలని చెప్పా. అలాగే మాట్లాడరా అన్నారు. 

69

ఫోన్ లో కాదు పర్సనల్ గా మాట్లాడాలి అని అడిగా. ఓకె ఇంటికి వచ్చేయ్ అన్నారు. ఒకరోజు ఆయన కోసం వెళ్ళా. ఆ సమయంలో చిరంజీవి గారు ఫైట్ సీన్ లో నటిస్తున్నారు. వెంటనే దర్శకుడు నిర్మాతతో చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేశారు. నేను షాక్. నా కోసం శరత్ గారు వచ్చారు.. కాబట్టి షూటింగ్ రేపు పెట్టుకుందాం అని ప్రొడ్యూసర్ తో చెప్పేసి నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్లారు. 

79

సురేఖ గారితో చెప్పి నా కోసం మంచి వంటకాలు వండించారు. భోజనం చేశాక చెప్పా.. ప్రస్తుతం తాను ఇబ్బందుల్లో ఉన్నానని. ఈ విధంగా ఓ చిత్రానికి నిన్ను అనుకుంటున్నాం అని చెప్పా. మీరు డేట్స్ కావాలని అడిగా. ప్రజెంట్ ఓ చిత్రం చేస్తున్నా. ఇది పూర్తి కాగానే నా డేట్స్ తీసుకో అన్నారు. 

89

మీకు రెమ్యునరేషన్ ఎంత కావాలి అని అడిగా.. ఆ ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన సమాధానం గురించి చెబుతూ లైవ్ లోనే శరత్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. 'ఏరా నువ్వు నాకు రెమ్యునరేషన్ ఇస్తావా.. అసలే ఇబ్బందుల్లో ఉన్నావు.. నాకు రెమ్యునరేషన్ అక్కర్లేదు.. నీ కోసం నేను సినిమా చేస్తాను పో' అని అన్నారు. 

99

ఆ చిత్రంతో నా ఇబ్బందులన్నీ తొలగిపోయాయని శరత్ కుమార్ అన్నారు. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్.. ఈ విషయాన్ని నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు అని శరత్ కుమార్ అన్నారు. గ్యాంగ్ లీడర్ టైంలో నువ్వు హీరో అవుతావురా అని అన్నారు. అలాగే హీరో అయ్యా. చిరంజీవి వల్ల నా జీవితంలో ఎన్నో మంచి సంగతులు చోటు చేసుకున్నాయని శరత్ కుమార్ తెలిపారు. 

click me!

Recommended Stories