Alia Bhatt : చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్.. ‘గంగూబాయి’ లేటెస్ట్ ఫొటో షూట్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 11:13 AM IST

‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీ హీరోయిన్ అలియాభట్ చీరకట్టుతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. నాజుకూ అందాలతో ఆకట్టుకుంటోంది. తను నటించిన ‘గంగూబాయి కథియవాడి’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా  లేటెస్ట్ ఫొటో షూట్ తో ఆకట్టుకుంటోంది అలియా..  

PREV
16
Alia Bhatt : చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్..  ‘గంగూబాయి’ లేటెస్ట్ ఫొటో షూట్..

అలియాభట్‌ తాజాగా నటించిన బాలీవుడ్‌ చిత్రం `గంగూబాయి కథియవాడి`. బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి  బాలీవుడ్ డైరెక్టర్ ‘సంజయ్ లీలా బన్సాలి’ దర్శకత్వం వహించారు. ఇప్పటీకే ఈ మూవీ నుంచి రిలీజైన టైటిల్ పోస్టర్లు, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.  
 

26

ముంబయిలోని కామటీపురంలో మాఫియా క్వీన్‌గా పాపులర్‌ అయిన గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించారు. అజయ్‌ దేవగన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అలియా తనవంతు పాత్ర పోషిస్తోంది.
 

36

ఇందుకోసం లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో ఆకట్టుకుటోంది గంగూబాయి. ఇప్పటికే మాస్ రోల్ లో కనిపించిన అలియా సోషల్ మీడియాలో మాత్రం చాలా క్లాస్ గా దర్శనమిచ్చి తన మూవీని ప్రమోషన్స్ ను కొనసాగిస్తోంది.  
 

46

తాజాగా అలియా గంగూబాయి కథియవాడి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చీరకట్టులో కనిపించి అందరినీ ఆకర్షిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌస్, లేతగులాజీ చీరలో అందరి మతిపోగొడుతోంది. తన కురులలో రెడ్ రోజ్ పెట్టుకుని నెటిజన్ల గుండెల్లో పూలవర్షం కురిపిస్తోంది. 
 

56

క్యూట్ లుక్స్ లో అదరగొడుతూనే తన ఫిల్మ్ ‘గంగూబాయి కథియవాడి’ ప్రమోషన్స్ కూడా చేసేంది. ఫిబ్రవరి 25న ‘గంగూ వచ్చేస్తోంది’ అంటూ క్యాప్షన్ లో పేర్కొంది. ఇప్పటికే గంగూబాయి పాత్రకి ప్రాణం పోసిన అలియా నటనను సినిమాలో చూసేందుకు ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. 

66

ఎన్టీఆర్‌తోనూ కొరటాల శివ డైరక్షన్ లో అలియా భట్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా అలియాభట్‌ కథానాయికగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  
 

click me!

Recommended Stories