మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రెయినింగ్ తీసుకుంటున్న పూజా హెగ్దే.. సాలిడ్ స్టంట్స్ చేయనున్న‘బుట్టబొమ్మ’..

Published : Jun 01, 2022, 06:07 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తనలో దాగి ఉన్న స్పెషల్ టాలెంట్ ను బయటపెట్టనుంది. ఇన్నాళ్లు బిగ్ స్క్రీన్ పై గ్లామర్ ఒళకబోసిన పూజా కొత్తగా మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుంది.   

PREV
17
మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రెయినింగ్ తీసుకుంటున్న పూజా హెగ్దే..  సాలిడ్ స్టంట్స్ చేయనున్న‘బుట్టబొమ్మ’..

టాలీవుడ్ హీరోయిన్ పూజాహెగ్దే (Pooja Hegde) తనలోని మరో నైపుణ్యాన్ని ప్రేక్షకులకు  పరిచయం చేయనుంది. ఇన్నాళ్లు బిగ్ స్క్రీన్ పై గ్లామర్ ఒళకబోసిన బుట్టబొమ్మ.. తన రాబోయే చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకోనుంది.
 

27

ఈ ఏడాది తను నటించిన మూడు చిత్రాలు ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీలతో పూజా అందనంత ఎత్తుకుపోతుందని అభిమానులు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా ఆ సినిమాలు ఫలితాలు రావడంతో పూజా క్రేజ్ తగ్గుతూ వస్తోంది.
 

37

దీంతో ఆడియెన్స్ ను మరింతగా అలరించేందుకు పూజా  సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం  ‘జన గణ మన’(JGM). ఇటీవల ఈ మూవీ హీరోయిన్ గా పూజా  హెగ్దే కన్ఫమ్ అయినట్టు సమాచారం. 
 

47

ఈ మూవీలో  పూరీ జగన్నాథ్ భారీ యాక్షన్  సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్ పూజా  హెగ్దే కూడా నటించనుంది. ఇందుకోసం  పూజా మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. 

57

‘జీజేఎం’ రెగ్యూలర్ షూటింగ్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది.  అయితే ఈ వారంలోనే పూజా విజయ్ దేవరకొండతో షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  యాక్షన్ సీక్వెన్స్ లో నటించేందుకు పూజ విదేవీ కోచ్ వద్ద ప్రత్యేకంగా శిక్షణను ప్రారంచిందని నెట్టింట ప్రచారం అవుతోంది. 
 

67

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇప్పటికే పూర్తైన చిత్రం ‘లైగర్’. ఈ మూవీ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు అన్నీ భాషల్లో రానుంది. ప్రస్తుతం మరో పాన్ ఇండియనన్ మూవీ ‘జన గణ మన’ ఇదే కాంబినేషనల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  
 

77

పూజా హెగ్దే తొలిసారిగా విజయ్ దేవరకొండ సరసన  నటిస్తుండటం పట్ల రౌడీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో పూజా యాక్షన్ సీక్వెన్స్ లో చేయనన్న సాలిడ్ స్టంట్స్ అభిమానులు ఆకట్టుకోనున్నాయి. మరోవైపు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోందీ పూజా. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ ‘భవదీయుడు భగత్ సింగ్’లో నటించనుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories