పూజా నటించిన దాదాపు ఐదు చిత్రాలు ఆరు నెలల్లోనే రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3 వంటి చిత్రాల్లో పూజాహెగ్దే నటించడం విశేషం. అయితే ఈ చిత్రాలు పూజాకు ఆశించినంతగా ఫలితాలివ్వకపోయినా పూజా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.