ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య!

First Published Feb 3, 2020, 6:24 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది. 

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది.
undefined
అమ్మాయిల కిడ్నాప్, హత్య లాంటి క్రైమ్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నాగ శౌర్య ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో నాగ శౌర్య తనకు ఛలో లాంటి హిట్ చిత్రాన్ని అందించిన వెంకీ కుడుములపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు నమ్మక ద్రోహం చేశాడని నాగ శౌర్య పేర్కొన్నాడు.
undefined
తమ మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడిందనే విషయాన్ని నాగ శౌర్య వివరించాడు. ఛలో కన్నా నాలుగేళ్ళ ముందు నుంచి వెంకీ కుడుముల నాకు పరిచయం. అప్పట్లో వెంకీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. సర్ సర్ అంటూ తిరిగేవాడు. కానీ నేను ఒక ఫ్రెండ్ లాగా భావించి చనువు ఇచ్చా. నాగ శౌర్య అని పేరు పెట్టి పిలువు పర్వాలేదు అని చెప్పా.
undefined
ఎలాగైనా హిట్ కొట్టాలి.. నువ్వు కథ రాసుకో.. నిర్మాతని నేను సెట్ చేస్తాను అని చెప్పా. మా అమ్మ కూడా వాడిని సొంత కొడుకు లాగానే భావించింది. ఒక కథతో వచ్చాడు. చాలా దరిద్రంగా ఉంది. మనం ఎలాగైనా హిట్ కొట్టాలి.. ఇలాంటి కథ రాశావేంటి అని తిట్టా. మరోసారి ఒక మంచి పాయింట్ అనుకుని ఛలో కథ సిద్ధం చేశాం. ఆ సినిమాకు నేను కూడా రచయితనే. కానీ వెంకీని ఫ్రెండ్ గా భావించి టైటిల్ కార్డ్స్ లో నా పేరు వేసుకోలేదు. నేను చేసిన తప్పు అదే.
undefined
కథ సిద్ధం అయ్యాక నిర్మాతని కలిశాం. ఆయన ఒప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వెంకీ నా వద్దకు వచ్చి ఈ సినిమాని నాగ శౌర్య హ్యాండిల్ చేయలేడు.. మరో హీరోని తీసుకుందాం అని నిర్మాత చెప్పినట్లు నాతో చెప్పాడు. నేను వెంటనే నిర్మాతని అడిగా.. అలా నేను అనలేదు. కానీ బడ్జెట్ ఎక్కువవుతుంది అని మాత్రం చెప్పినట్లు నిర్మాత నాతో చెప్పారు.
undefined
అప్పటికి వెంకీని ఫ్రెండ్ గానే భావించా. వాడి తొలి చిత్రం ఎలాగైనా విజయం సాధించాలని అనుకున్నా. నిర్మాతతో సర్ నేను రెమ్యునరేషన్ లేకుండా ఈ సినిమా చేస్తా. సినిమా హిట్ అయితే మీకు తోచినంత ఇవ్వండి చాలు అని చెప్పా. ఆయన ఓకే అన్నారు. ఇదంతా నేను వెంకీ కోసమే చేశా.
undefined
సినిమా ఓకే అయిన విషయాన్ని ఫోన్ చేసి మా అమ్మకు చెప్పా. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. నువ్వు ఇంకొకరి దగ్గర తగ్గడం ఏమిటి రా.. ఆ సినిమాని మనమే నిర్మిద్దాం అని అంది. సినిమా నిర్మాణం కష్టం అని చెప్పినా వినలేదు. నీతో పాటు, వెంకీ కూడా నా కొడుకు లాంటివాడే. మీ ఇద్దరి కోసం ఈ సినిమా నిర్మాస్తా అని అమ్మ చెప్పింది.
undefined
అలా ఐరా క్రియేషన్స్ ప్రారంభించి ఛలో చిత్రం చేశాం. సూపర్ హిట్ అయింది. వెంకీ కారు లేకుండా ఇబ్బంది పడుతున్నాడని మా అమ్మ కొత్త కారు కొనిచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశాడు. నాతో మాట్లాడడం మానేశాడు.
undefined
ఒకసారి గమనిస్తే నేను ఇచ్చిన కారు కూడా వాడు వాడడం లేదు. మరో కారులో తిరుగుతున్నాడు. వెంకీ అలా చేసే సరికి మా అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాడి కోసం ఇంత చేస్తే నన్ను ఎందుకు కట్ చేశాడో తెలియదు. బహుశా వాడి క్యారెక్టర్ అదేనేమో. నాకు ఎదురుపడే ధైర్యం వాడు చేయడు. ఒకవేళ నా దగ్గరికి వస్తానని చెప్పినా నేను రానివ్వను అంటూ నాగశౌర్య వెంకీ కుడుముల గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.
undefined
click me!