Published : Apr 30, 2020, 10:20 AM ISTUpdated : Apr 30, 2020, 10:40 AM IST
బుధవారం ఇర్ఫాన్ ఖాన్ మృతితో బరువెక్కిన హృదయాల తడి ఆరకముందే మరో భారీ షాక్ తగిలింది. లెజెండరీ నటుడు, కపూర్ ఫ్యామిలీ సీనియర్ హీరో రిషీ కపూర్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇటీవల విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. అంతా సర్దుకుంటుందనుకున్ సమయంలో అకస్మాత్తుగా పరిస్థితి విషయమించటంతో బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆరోగ్యం క్షీణించటంతో గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.